ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: కేటీఆర్‌ను 31 వరకు అరెస్టు చేయొద్దు

ABN, Publish Date - Dec 28 , 2024 | 04:16 AM

ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనను ఈ నెల 31 వరకు అరెస్ట్‌ చేయరాదని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది.

  • ఫార్ములా-ఈ రేసు కేసులో హైకోర్టు ఆదేశాలు.. తదుపరి విచారణ 31కి వాయిదా

  • కేటీఆర్‌ అరెస్ట్‌ వద్దన్న ఉత్తర్వులు ఎత్తేయండి.. వెకేట్‌ స్టే పిటిషన్‌ దాఖలు చేసిన ఏసీబీ

  • నేరం లేదు.. ఉన్నదంతా కుట్రే.. అనుమతుల బాధ్యత నాది కాదు.. అధికారులదే

  • నాపై కేసు పెట్టాలనే వాయిదాల ఎగవేత.. ప్రభుత్వ తీరు వల్లే నష్టం: కేటీఆర్‌ కౌంటర్‌

  • బిగుస్తున్న ఉచ్చు!.. ఫార్ములా-ఈ కేసులో కేటీఆర్‌ మీద 409 సెక్షన్‌

  • నోటీసులు ఇవ్వకుండా అరెస్టుకు అవకాశం.. క్వాష్‌ పిటిషన్‌ తేలగానే ఏసీబీ నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఫార్ములా ఈ-రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్‌కు హైకోర్టులో మరోసారి ఊరట లభించింది. ఆయనను ఈ నెల 31 వరకు అరెస్ట్‌ చేయరాదని హైకోర్టు ఏసీబీని ఆదేశించింది. ఈ మేరకు ఇప్పటికే జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ఈ నెల 31 వరకు పొడిగించింది. మరోవైపు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయడానికి అనుమతి ఇవ్వాలని, ఆయనను అరెస్ట్‌ చేయకుండా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తేయాలంటూ హైకోర్టుకు ఏసీబీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మధ్యంతర అప్లికేషన్‌ను దాఖలు చేసింది. ఫార్ములా ఈ-రేసు వ్యవహారంలో నిబంధనలు ఉల్లంఘించి విదేశీ సంస్థకు ప్రభుత్వ సొమ్మును చెల్లించారన్న సర్కారు ఫిర్యాదు మేరకు ఏసీబీ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తనపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్‌ హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న జస్టిస్‌ ఎన్వీ శ్రవణ్‌కుమార్‌ ధర్మాసనం ఈ నెల 30 వరకు కేటీఆర్‌ను అరెస్ట్‌ చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.


ఈ కేసును రెగ్యులర్‌ రోస్టర్‌ కలిగిన ధర్మాసనం ఎదుట లిస్ట్‌ చేయాలని రిజిస్ర్టీని ఆదేశించింది. ఈ కేసు శుక్రవారం రెగ్యులర్‌ రోస్టర్‌ కలిగిన జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. ఏసీబీ తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌ దాఖలు చేశామని, వెకేట్‌ స్టే పిటిషన్‌పై వాదనలు వినిపిస్తామని అన్నారు. మరోవైపు కేటీఆర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదిస్తూ.. ఏసీబీ కౌంటర్‌కు రిప్లై దాఖలు చేశామని తెలిపారు. కాగా, ఫార్ములా కేసులో ఫిర్యాదుదారుగా ఉన్న మునిసిపల్‌ శాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ తరఫున అదనపు ఏజీ తేరా రజినీకాంత్‌రెడ్డి హాజరయ్యారు. ‘మీరు ప్రత్యేకంగా కౌంటర్‌ వేస్తారా?’ అని ధర్మాసనం ఏఏజీని ప్రశ్నించగా.. తాము ఏసీబీ దాఖలు చేసిన కౌంటర్‌ను అనుసరిస్తామని ఆయన పేర్కొన్నారు. ఉత్తర ప్రత్యుత్తరాలు పూర్తయిన దరిమిలా ఇక ప్రధాన అంశంపై ఈ నెల 31న వాదనలు వింటామని ధర్మాసనం తెలిపింది.

Updated Date - Dec 28 , 2024 | 04:17 AM