ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: కేంద్రమంత్రి పదవిపై లక్ష్మణ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ABN, Publish Date - Jun 06 , 2024 | 07:47 PM

కేంద్రమంత్రి పదవిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని స్పష్టం చేశారు.పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ రేసులో ఉండనని.. ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని అన్నారు.

Laxman

ఢిల్లీ: కేంద్రమంత్రి పదవిపై బీజేపీ ఎంపీ లక్ష్మణ్ (Laxman) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏ బాధ్యత ఇచ్చిన నిర్వహిస్తానని స్పష్టం చేశారు.పార్టీ ఏది ఆదేశిస్తే అది నిర్వహిస్తానని అన్నారు. తాను ఎప్పుడూ రేసులో ఉండనని.. ఎవరికీ ఏం ఇవ్వాలనేది పార్టీ నిర్ణయమని అన్నారు. లోక్‌సభ ఫలితాల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీకి బీఆర్ఎస్ ఓట్లు బదిలీ అయ్యాయని అంటున్నారని అన్నారు. రేవంత్ వ్యాఖ్యలు చూస్తే దొంగే దొంగ అన్నట్టు ఉందని చెప్పారు.


కాంగ్రెస్, బీ.ఆర్ఎస్ అసెంబ్లీలో ఒప్పందం చేసుకొని ఎన్నికల్లో గెలిచిందన్నారు. కాంగ్రెస్ కేవలం 8 సీట్లు మాత్రమే గెలిచిందని తెలిపారు.ఆరు నెలలకే బీజేపీ 8 సీట్లు సాధించిందన్నారు. గొర్రెల పంపిణీ, ధరణి, డ్రగ్స్ అన్ని తెరపైకి తీసుకొచ్చి కేవలం బీఆర్ఎస్‌తో బేరసారాలకు తీసుకొచ్చారన్నారు..పాత్రధారులను అరెస్ట్ చేశారు, సూత్రధారులు ఎవరో చెప్పడం లేదన్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని గతంలో ప్రచారం చేశారన్నారు. రేవంత్ మాటలతో ప్రజలను మభ్యపెట్టారన్నారు. కేసీఆర్ వాళ్ల ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


టికెట్ విషయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికర ఒప్పందం చేసుకున్నారని చెప్పారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేను ఎంపీగా బరిలోకి దింపిందన్నారు. ఎందుకు రాజీనామా చేయని వారిపై చర్యలు తీసుకోలేదని అన్నారు. డిసెంబర్ 9 తెలంగాణ తల్లి ఉత్సవాలు అంటున్నారని.. ఏఐసీసీ అగ్రనేత సోనియాగాంధీ తెలంగాణ తల్లినా ?లేక బలి దేవతనా ? అని ప్రశ్నించారు.సోనియాగాంధీని బలి దేవత అని రేవంత్ రెడ్డి అనలేదా అన్ని ప్రశ్నించారు. రైతు భరోసా, రైతు రుణ మాఫీ చేయట్లేదన్నారు.తెలంగాణ ప్రజలు 8 సీట్లలో బీజేపీని గెలిపించారని అన్నారు. 2023 ఎన్నికల్లో బీజేపీకి 14 శాతం ఓట్లు వస్తే, ఎంపీ ఎన్నికల్లో 35 శాతం ఓట్లు సాధించామని చెప్పుకొచ్చారు.


ఒక్క సీటు కూడా బీఆర్ఎస్‌కి రాలేదన్నారు. కంచుకోట అయిన కరీంనగర్, మెదక్‌లో కూడా ఓడిపోయారని తెలిపారు. రాజకీయంగా బీఆర్ఎస్‌ను బొందపెట్టారన్నారు. ఆ పార్టీది ముగిసిన అధ్యాయమని అన్నారు. రేవంత్ రెడ్డిని తాను డిమాండ్ చేస్తున్నానని.. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం వాటా బీసీలకు ఇస్తామని అన్నారని చెప్పారు. మొదట అవి ప్రకటించి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని అన్నారు.ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలతో రేపు సమావేశం ఉందని చెప్పారు. రేపు సాయంత్రం రాష్ట్రపతిని కలుస్తామని తెలిపారు. ఎల్లుండి ప్రధాని మోదీ మరోసారి ప్రమాణస్వీకారం చేస్తారని లక్ష్మణ్ పేర్కొన్నారు.

Updated Date - Jun 06 , 2024 | 07:47 PM

Advertising
Advertising