ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ!

ABN, Publish Date - Jun 18 , 2024 | 02:56 AM

రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

  • జూలై 17న మొదలు పెట్టి ఆగస్టు దాకా మూడు విడతల్లో ప్రక్రియ పూర్తి

  • ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదు

  • ఆదాయపన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు

  • 4 రోజుల్లో మంత్రివర్గం భేటీఅందులోనే విధివిధానాల ఖరారు

  • రుణమాఫీకి 25వేల కోట్లు అవసరమని అంచనా

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): రైతులకు రుణమాఫీని తొలి ఏకాదశి, అంటే జూలై 17న మొదలుపెట్టనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. రుణమాఫీ ప్రక్రియను జూలైలోనే ప్రారంభిస్తే అప్పటికే వ్యవసాయ పనులు ముమ్మరమై పెట్టుబడి అవసరమైన రైతులకు మళ్లీ రుణం తీసుకునేందుకు అవకాశం కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. జూలైలో ప్రారంభించి ఆగస్టు వరకు మొత్తం 3 విడతల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నిధుల సమీకరణ కొలిక్కివస్తుండటంతో.. అన్నదాతలకు హామీనిచ్చిన ఆగస్టు 15 వరకు కాకుండా.. ఒక నెల ముందుగానే పక్రియను ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ‘పీఎం కిసాన్‌’ పథకంలో ఉన్న నిబంధనలనూ రుణమాఫీలో అమలుచేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనిపై దాదాపు తుది నిర్ణయానికి వచ్చినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది.


దీని ప్రకారం మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్నవారు, ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆదాయ పన్ను కడుతున్న వారికి రుణమాఫీ అందేందుకు అవకాశం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో గ్రామీణ ప్రాంతాల్లోని చిన్న రైతులు, మిగతా చిన్న ఉద్యోగస్తులు కూడా వివిధ అవసరాల నిమిత్తం ఆదాయ పన్ను రిటర్నులు దాఖలు చేస్తున్నారన్న అంశం తెరమీదకు వచ్చింది. రిటర్నులు దాఖలు చేశారన్న కారణంతో ఆ రైతులను మాఫీ నుంచి మినహాయించే అవకాశాలు లేవని, ఆదాయ పన్ను కడుతున్న వారినే మినహాయించే ఆలోచన ఉందని తెలుస్తోంది. ఆ మేరకు ఐటీ రిటర్నులు దాఖలుచేస్తున్న చిన్న రైతులకు, చిన్న ఉద్యోగస్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.


వీటన్నింటిపై ఏంచేయాలనేదానిపై 4రోజుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించి రుణమాఫీ అమలుకు తీసుకోవాల్సిన విధివిధానాలను ప్రభుత్వం ఖరారు చేయనుంది. మరోవైపు పీఎం కిసాన్‌లో అమలుచేస్తున్న నిబంధనలను రుణమాఫీకి కూడా వర్తింపజేసినా ఈ పథకం కోసం రూ.25వేల కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నారు. రుణమాఫీకి అర్హులైన కుటుంబాలను గుర్తించేందుకు భూమి పాస్‌బుక్‌, రేషన్‌ కార్డు, ఆధార్‌కార్డులతో పాటు బ్యాంకుల ఖాతాలను ప్రామాణికంగా తీసుకుంటారు. అదే విధంగా ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేవరకు రైతులకు ఏవైనా ఇబ్బందులు తలెత్తితే పరిష్కరించేందుకు వీలుగా ఫిర్యాదుల స్వీకరణకు ప్రత్యేకంగా గ్రీవెన్స్‌ సెల్‌ను కూడా ఏర్పాటుచేయనున్నారు.

Updated Date - Jun 18 , 2024 | 02:56 AM

Advertising
Advertising