TG Politics: పరిటాల రవి హత్య జరిగినప్పుడు ప్రవీణ్ కుమార్ మీద చర్యలు తీసుకున్నారా.. మల్లు రవి సూటి ప్రశ్నలు
ABN, Publish Date - May 26 , 2024 | 09:13 PM
బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు.
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత శ్రీధర్ రెడ్డి హత్యకు దారితీసిన కారణాల మీద విచారణ జరుగుతుందని.. బాధ్యుల మీద చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి (Mallu Ravi) తెలిపారు. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) కొల్లాపూర్‌ను కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలని అడుగుతున్నారని.. అక్కడి పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని స్టేట్మెంట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని.. వాస్తవాలకు వ్యతిరేకంగా ఆ కామెంట్స్ ఇచ్చారని మండిపడ్డారు.
గాంధీభవన్‌లో ఆదివారం మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ... మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని తెలిపారు. అలంపూర్‌లో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఈవీఎంలు పగలగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. పోలీస్ అధికారిగా పని చేసిన ప్రవీణ్ కుమార్ ఎస్పీగా ఉన్నప్పుడు దివంగత మాజీ మంత్రి పరిటాల రవి హత్య జరిగితే ఆయన మీద చర్యలు తీసుకున్నారా..? అని ప్రశ్నించారు.బుల్డోజర్ పెట్టీ కొల్లాపూర్‌లో మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రజల ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నారని ప్రవీణ్ ఎలా అంటున్నారని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం నుంచి కార్యకర్త వరకు బుల్డోజర్ పద్ధతికి వ్యతిరేకమన్నారు. ప్రవీణ్ కుమార్ మానసిక పరిస్థితి బాగోలేదని విమర్శించారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఎన్‌కౌంటర్లు చేసిన ప్రవీణ్ కల్లోలిత ప్రాంతంగా కొల్లాపూర్‌ను ప్రకటించాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. బీఆర్ఎస్ నేతలు కేసీఆర్, కేటీఆర్ వేసిన వ్యూహాల్లో ప్రవీణ్‌ను పావుగా వాడుకున్నారని ఆరోపించారు. అందుకే ప్రవీణ్‌ను బీఎస్పీ అధ్యక్షుడిగా కేసీఆర్ చేశారని ఆక్షేపించారు. బీఆర్ఎస్‌లోకి కేసీఆర్ రమ్మనగానే ప్రవీణ్ బీఎస్పీని వదిలేసి వెళ్లారని ఎద్దేవా చేశారు.
ఆయన కేసీఆర్ మీద అనేక విమర్శలు చేశారని.. అలాంటి వ్యక్తి ఆ పార్టీలోకి ఒక్క రోజులో ఎలా వెళ్లారని ప్రశ్నించారు. కేసీఆర్ చేతిలో ప్రవీణ్ కుమార్ ఆట బొమ్మలా మారారని సెటైర్లు గుప్పించారు. పదేళ్లలో కేసీఆర్ ఒక్కసారి అయినా ప్రతిపక్ష నేతలతో పరిపాలన గురించి చర్చించారా..ప్రవీణ్ కుమార్ చెప్పాలని నిలదీశారు. జూన్ 4 తర్వాత ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్‌కు జిల్లాలో భారీ సభ పెట్టి సరైన సమాధానం చెబుతామన్నారు. పోలీస్ వ్యవస్థను అవమాన పరిచే విధంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని మల్లు రవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి
Minister Tummala: నా లక్ష్యం అదే.. మంత్రి తుమ్మల ఆసక్తికర వ్యాఖ్యలు
TG Politics: బీఆర్ఎస్ నేతలు భారీగా డబ్బులను ట్రాన్స్‌ఫర్ చేశారు.. రఘునందన్ రావు సంచలన ఆరోపణలు
TG Politics: మహేశ్వర రెడ్డిని మేమే పెంచి పోషించాం: మంత్రి ఉత్తమ్
Read Latest Telangana News and Telugu News
Read Latest AP News and Telugu News
Updated Date - May 26 , 2024 | 09:47 PM