ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అమెరికాలో ఉద్యోగి హైదరాబాద్‌లో దొంగ..

ABN, Publish Date - Jun 23 , 2024 | 04:31 AM

అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారం చేసి నష్టపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చివరికి దొంగగా మారాడు. ఓ నగల దుకాణంలో దోపీడీకి యత్నించి పోలీసులకు చిక్కాడు.

  • మేడ్చల్‌లో నగల దుకాణంలో దోపిడీకి యత్నించిన ఇద్దరి అరెస్టు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన ఓ వ్యక్తి హైదరాబాద్‌లో వ్యాపారం చేసి నష్టపోయి ర్యాపిడో డ్రైవర్‌గా మారాడు. ఆర్థిక కష్టాలను అధిగమించేందుకు చివరికి దొంగగా మారాడు. ఓ నగల దుకాణంలో దోపీడీకి యత్నించి పోలీసులకు చిక్కాడు. మేడ్చల్‌లోని నగల దుకాణంలో ఇటీవల దోపిడీకి యత్నించి పరారైన నజీమ్‌ అజీజ్‌ కొఠాడియా (36), షేక్‌ సోహైల్‌ను సైబరాబాద్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సైబరాబాద్‌ సీపీ అవినాష్‌ మహంతి శనివారం విలేకరులకు వెల్లడించారు. మహారాష్ట్రకు చెందిన నజీమ్‌ అజీజ్‌ కొఠాడియా చదువు పూర్తయ్యాక ఆఫ్రికా, చైనా, అమెరికాల్లో ఉద్యోగాలు చేశాడు. అమెరికా నుంచి హైదరాబాద్‌ వచ్చిన అజీజ్‌ స్థానికంగ వ్యాపారం చేసి తీవ్రంగా నష్టపోయాడు. కుటుంబపోషణ కష్టంగా మారడంతో ర్యాపిడో డ్రైవర్‌గా చేశాడు.


సరైన ఆదాయం రాకపోవడంతో దొంగతనానికి సిద్ధమయ్యాడు. చాదర్‌ఘాట్‌లోని ఓ నగల దుకాణంలో దొంగతనం చేసిన అజీజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి చంచల్‌గూడ జైలుకు తరలించారు. అక్కడ తనకు పరిచయమైన షేక్‌ సోహైల్‌తో కలిసి జైలు నుంచి విడుదలయ్యాక మళ్లీ చోరీ చేసేందుకు పథకం వేసుకున్నాడు. జైలు నుంచి విడుదలైన అజీజ్‌, సోహైల్‌ నగల దుకాణంలో చోరీ చేసేందుకు పలు ప్రాంతాల్లో రెక్కీ నిర్వహించి మేడ్చల్‌లోని ఓ దుకాణాన్ని ఎంపిక చేసుకున్నారు. ముం దుగా ఓ బైక్‌ను చోరీ చేశారు.


ఈ నెల 20న ముఖానికి మాస్కు, హెల్మ్‌ట్‌ ధరించి మేడ్చల్‌లోని జగదాంబ జ్యువెలెర్స్‌ దుకాణంలోకి వెళ్లి యజమానికి కత్తి చూపించి నగల కోసం బెదిరించారు. దుకాణ యజమాని కుమారుడు కేకలు వేస్తూ ఎదురుదాడికి యత్నించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఇదంతా 40 సెకండ్లలోనే జరిగింది. మేడ్చల్‌ నుంచి నిజామాబాద్‌ వైపు వెళ్లే రోడ్డు పక్కన బైక్‌ వదిలేసి పారిపోయారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు చోరికి యత్నించిన బైక్‌ ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్టు చేశారు.

Updated Date - Jun 23 , 2024 | 04:31 AM

Advertising
Advertising