ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Hyderabad: టెస్కాబ్‌ చైర్మన్‌గా మార్నేని రవీందర్‌రావు

ABN, Publish Date - Jun 11 , 2024 | 03:14 AM

తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన మార్నేని రవీందర్‌రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా, టెస్కాబ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వైస్‌ చైర్మన్‌గా హైదరాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య నియమితులయ్యారు.

  • వైస్‌ చైర్మన్‌గా కొత్తకుర్మ సత్తయ్య

  • సీఎం రేవంత్‌, మంత్రి తుమ్మల అభినందనలు

హైదరాబాద్‌, హనుమకొండ సీటీ జూన్‌ 10(ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌ బ్యాంకు(టెస్కాబ్‌) చైర్మన్‌గా వరంగల్‌ జిల్లాకు చెందిన మార్నేని రవీందర్‌రావు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన వరంగల్‌ డీసీసీబీ చైర్మన్‌గా, టెస్కాబ్‌ డైరెక్టర్‌గా ఉన్నారు. వైస్‌ చైర్మన్‌గా హైదరాబాద్‌ డీసీసీబీ ఛైర్మన్‌ కొత్తకుర్మ సత్తయ్య నియమితులయ్యారు. హైదరాబాద్‌ అబిడ్స్‌లోని టెస్కాబ్‌ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా ముగిసింది. ఎన్నిక పూర్తయిన తరువాత రాష్ట్ర సహకార సంఘాల రిజిస్ట్రార్‌ హరిత నుంచి రవీందర్‌రావు నియామక పత్రాన్ని అందుకున్నారు. అనంతరం కొత్తగా ఎన్నికైన ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌లతోపాటు డైరెక్టర్లు... ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో పాటు పలువురిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్‌ ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇక్కడి డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ టెస్కాబ్‌ చైర్మన్‌గా నియమితులు కావడం ఇదే తొలిసారి కావడం విశేషం.


కొండూరి రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీ

రాష్ట్రంలో మొత్తం 9 డీసీసీ బ్యాంకులు ఉన్నాయి. కాంగ్రెస్‌ అధికారం చేపట్టడంతో అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. చైర్మన్లుగా ఉన్న వారిలో ఏడుగురు బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రె్‌సలోకి చేరారు. టెస్కాబ్‌ చైర్మన్‌గా ఉన్న కొండూరు రవీందర్‌రావుతో పాటు వైస్‌ చైర్మన్‌గా ఉన్న నల్గొండ డీసీసీ బ్యాంక్‌ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సను వీడలేదు. ఈ నేపథ్యంలో వారిని పదవులను నుంచి తొలగించేందుకు కొందరు బ్యాంకు డైరెక్టర్లు ఇటీవల సహకారశాఖ రిజిస్ట్రార్‌కు అవిశ్వాస తీర్మానానికి నోటీసు ఇచ్చారు. దాంతో ఈనెల 1న కొండూరి రవీందర్‌రావు, మహేందర్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా చేశారు. వాస్తవానికి అవిశ్వాసంపై సోమవారం సమావేశం నిర్వహించాల్సి ఉంది. ముందస్తుగా రాజీనామాలు చేయటంతో సమావేశాన్ని రద్దుచేశారు. ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులపై క్లియరెన్స్‌ వచ్చింది.


దీంతో మెజార్టీ డైరెక్టర్ల సమక్షంలో చైర్మన్‌గా రవీందర్‌రావు, వైస్‌చైర్మన్‌గా సత్తయ్యలను ఎన్నుకున్నారు. కాగా, మార్నేని రవీందర్‌రావు స్వస్థలం ఐనవోలు. ఆయన తండ్రి మార్నేని మాధవరావు స్వాతంత్య్ర సమరయోధుడు. భార్య మధుమతి ఐనవోలు ఎంపీపీగా ఉన్నారు. ఆయన 1983 నుంచి టీడీపీలో ఉంటూ అనేక పదవులు చేపట్టారు.1987లో ఐనవోలు సింగిల్‌ విండో చైర్మన్‌గా, 1996 నుంచి 2004 వరకు శ్రీమల్లిఖార్జున దేవస్థానం ఐనవోలు ధర్మకర్తల మండలి చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించారు. 2006లో వర్ధన్నపేట జెడ్‌పీటీసీగా ఎన్నికై, జెడ్‌పీ ఫ్లోర్‌ లీడర్‌గా వ్యవహరించారు. 2009లో బీఆర్‌ఎ్‌సలో చేరి వరంగల్‌ ఉమ్మడి జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్‌గా 2020 ఫిబ్రవరి 29 బాధ్యతలు చేపట్టారు.

Read more!

Updated Date - Jun 11 , 2024 | 03:14 AM

Advertising
Advertising