ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Medak: మెదక్‌ అల్లర్ల బాధ్యులను వదిలిపెట్టం..

ABN, Publish Date - Jun 17 , 2024 | 04:34 AM

మెదక్‌లో శనివారం అల్లర్లకు పాల్పడిన వారిలో 45 మందిని గుర్తించామని, వీరిలో ఒక వర్గానికి చెందిన 23 మంది, మరో వర్గానికి చెందిన 22 మంది ఉన్నారని మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు.

  • ఐజీ రంగనాథ్‌, ఎస్పీ బాలస్వామి వెల్లడి

  • మెదక్‌ బంద్‌ ప్రశాంతం.. భారీ బందోబస్తు

మెదక్‌ అర్బన్‌, జూన్‌ 16: మెదక్‌లో శనివారం అల్లర్లకు పాల్పడిన వారిలో 45 మందిని గుర్తించామని, వీరిలో ఒక వర్గానికి చెందిన 23 మంది, మరో వర్గానికి చెందిన 22 మంది ఉన్నారని మల్టీజోన్‌-1 ఐజీ ఏవీ రంగనాథ్‌ తెలిపారు. ఆదివారం ఆయన పట్టణ పోలీస్‌ స్టేషన్‌లో మీడియాతో మాట్లాడారు. కొంతమంది స్వార్థమే అల్లర్లకు కారణమని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఛత్తీ్‌సగఢ్‌, ఒడిసా నుంచి గోవులను అక్రమంగా గోవులను తెస్తున్న వారిపై కేసులు నమోదు చేశామని, గోవులను గోశాలకు పంపుతున్నామన్నారు. కాగా, అల్లర్ల కేసులో బాధితుల ఫిర్యాదుపై పోలీసులు 21 మందిని అరెస్టు చేసినట్టు ఎస్పీ బాలస్వామి తెలిపారు. ఒక వర్గానికి చెందిన 12మంది, మరో వర్గానికి చెందిన 9 మందిపై 8 కేసులు నమోదు చేశామన్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా.. 14 రోజుల రిమాండ్‌ విధించారని చెప్పారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడం కోసం 8 ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశామన్నారు.


మెదక్‌ బంద్‌ ప్రశాంతం

బీజేపీ, అనుబంధ సంఘాల పిలుపు మేరకు ఆదివారం మెదక్‌లో బంద్‌ ప్రశాంతంగా ముగిసింది. దాడులు, పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ, బీజేవైఎం, వీహెచ్‌పీ, భజరంగ్‌దశ్‌ పట్టణ బంద్‌కు పిలుపునిచ్చాయి. వ్యాపార, వాణిజ్య సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు.


కారకులపై చర్యలు తీసుకోవాలి: సంజయ్‌

హైదరాబాద్‌, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): సమాజంలో అశాంతి సృష్టించేలా ఎవరు వ్యవహరించినా వారిపై చర్యలు తీసుకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ సూచించారు. మెదక్‌లో ఇరు వర్గాల పరస్పర దాడుల గురించి ఆయన ఆరా తీశారు. తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులకు ఫోన్‌ చేసి పూర్వాపరాలు అడిగి తెలుసుకున్నారు. పోలీసులు బాధితుల పక్షాన నిలబడటమే కాకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులపై అక్రమ కేసులు బనాయించడం, అమాయకులను ఇబ్బంది పెట్టడం చేయొద్దన్నారు. పోలీసులు తీసుకునే చర్యల ఆధారంగానే పరిస్థితులు చక్కబడతాయన్నారు.

Updated Date - Jun 17 , 2024 | 04:58 AM

Advertising
Advertising