ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Gajwel: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..

ABN, Publish Date - Dec 08 , 2024 | 07:57 AM

గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు.

సిద్దిపేట: గజ్వేల్ పట్టణం జాలిగామ బైపాస్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు కానిస్టేబుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. మృతులను పరంధాములు(43), పూస వేంకటేశ్వర్లు(42) గా పోలీసులు గుర్తించారు. పరంధాములు సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తుండగా.. దౌల్తాబాద్ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పూస వేంకటేశ్వర్లు పని చేస్తున్నారు. వీరిద్దరూ ఈసీఎల్‌లో జరుగుతున్న మారథాన్ రన్నింగ్‌లో పాల్గొనేందుకు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా ప్రమాదం జరిగింది. జాలిగామ బైపాస్ వద్ద వీరి బైక్‌ను ఓ వాహనం బలంగా ఢీకొట్టంది. దీంతో ఇరువురూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Updated Date - Dec 08 , 2024 | 07:57 AM