TS Politics: ఆ హామీ ఎలా సాధ్యం.. సీఎం రేవంత్‌కు ఈటల రాజేందర్ సవాల్
ABN, Publish Date - Feb 27 , 2024 | 07:39 PM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.34 వేల కోట్ల రుణమాఫీని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చారని ఎలా సాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్ చేరుకున్నది.
మెదక్ జిల్లా: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) రూ.34 వేల కోట్ల రుణమాఫీని అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చారని ఎలా సాధ్యమని మాజీ మంత్రి ఈటల రాజేందర్(Etala Rajender) ప్రశ్నించారు. ఈ విషయంపై సీఎం రేవంత్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. మంగళవారం నాడు బీజేపీ విజయ సంకల్ప యాత్ర మెదక్ చేరుకున్నది. ఈ యాత్రలో ఈటల రాజేందర్ మాట్లాడుతూ... మహిళలకు ఫ్రీగా బస్సు ప్రయాణం జరగాల్సిందే... కానీ ఆటో డ్రైవర్లకు రేవంత్ ప్రభుత్వం ఇస్తామన్న రూ.12 వేల సాయం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పేదలకు వైద్యం అందించాలనే లక్ష్యంతో మోదీ సర్కార్ ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా రూ.10 లక్షలు ఇస్తుందని వినియోగించుకోవాలని సూచించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే కేసీఆర్‌కు పట్టిన గతే రేవంత్ రెడ్డికి పడుతుందని హెచ్చరించారు.
ప్రజలు కాంగ్రెస్‌ను గోల్‌మాల్ చేస్తారు..
తెలంగాణ వచ్చినప్పుడు తాగుడుతో వచ్చే ఆదాయం రూ.10,700 కోట్లు.. నేడు రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తుందని చెప్పారు. మహిళల కోసం వెంటనే బెల్ట్ షాపులు మూసేయాలని కోరారు. మాజీ సీఎం కేసీఆర్ లక్ష రుణమాఫీ చేయకుండా బోల్తా పడ్డారని అన్నారు. సీఎం రేవంత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అన్ని డిక్లరేషన్లు ఇచ్చారని ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ప్రజలు గోల్ మాల్ కారని.. కాంగ్రెస్‌ను గోల్ మాల్ చేస్తారని విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఓటేయాలని పిలుపునిచ్చారు. దేశబార్డర్‌లో మోదీ ప్రభుత్వం వచ్చాక ఆర్మీలు ప్రశాంతంగా ఉంటున్నారని చెప్పారు. బీజేపీ అధికారంలోకి వస్తే మత కల్లోలాలు జరుగుతాయని ప్రతిపక్షాలు అబద్ధపు ప్రచారం చేస్తున్నాయని విరుచుకుపడ్డారు. రాబోయే రోజుల్లో బీజేపీకి ఓటేసి మరోసారి ఆశీర్వదించాలని ఈటల రాజేందర్ కోరారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.
Updated Date - Feb 27 , 2024 | 07:39 PM