ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: రేవంత్ ఆ డబ్బులు ఇవ్వాలి లేకపోతే.. హరీశ్ మాస్ వార్నింగ్

ABN, Publish Date - Jun 09 , 2024 | 06:15 PM

తెలంగాణలో రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు.

సిద్దిపేట: తెలంగాణలో రైతులు ఖరీఫ్ పనులు మొదలు పెట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా రైతు బంధుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని.. ఈ విషయంపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం వర్షం పడగానే రైతుబంధు ఇచ్చేదని.. కానీ రేవంత్ ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. పంట సాగుకు ముందే ఎకరాకు రైతుబంధు రూ.7500 ఇస్తామన్నారని.. ఇచ్చిన హామీకు సీఎం రేవంత్ కట్టుబడి ఉండాలని కోరారు.


రైతులను ఆదుకోవడంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విఫలం అయ్యారని ఫైర్ అయ్యారు. నేడు(ఆదివారం)నంగునూర్ మండలం అక్కెనపల్లిలో మొట్టమొదటి అయిల్ ఫామ్ క్రాప్ కటింగ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ... ఆయిల్ ఫామ్ సాగులో కోకో, కాఫీ పంట చేసుకునే అవకాశం ఉందన్నారు. కోకో సాగుతో ఆయిల్ ఫామ్ రైతులకు అదనపు ఆదాయం వస్తుందని తెలిపారు. ఫామాయిల్‌పై కేంద్ర సుంకం మొత్తం ఎత్తివేసిందని చెప్పారు. కేంద్రం నిర్ణయంతో ఇక్కడి రైతులు నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఫామాయిల్‌పై కేంద్ర సుంకం కచ్చితంగా తగ్గించాలని డిమాండ్ చేశారు.


కష్టం డ్యూటీ 15శాతం పునరుద్ధరిస్తే రైతులకు మేలు జరుగుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ ఫామ్ రైతులను చిన్న చూపు చూస్తోందని మండిపడ్డారు. ఏడాదికి ఇచ్చే క్రాప్ మెంయిటనెన్స్ రూ.4000వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. జనుము, విత్తనాలు దొరకడం లేదని రైతులు ఫిర్యాదు చేస్తున్నారని.. ప్రభుత్వం రైతులకు ఈ విత్తనాలు సకాలంలో అందజేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా పచ్చి రొట్టె, విత్తనాల కొరత లేకుండా చూడాలని కోరారు. వడ్లకు రూ.500ల బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నాలకు మాత్రమే అంటున్నారని.. అలా కాకుండా అన్ని వడ్లకు బోనస్ ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి

Bandi Sanjay: ఆర్ఎస్ఎస్ నుంచి.. కేంద్ర మంత్రి వరకు.. 'బండి' ప్రయాణం సాగిందిలా

Etela Rajender: బీజేపీ రాష్ట్రాధ్యక్షుడిగా ఈటల!?

Ponguleti: అర్హులైన పేదలకు పెన్షన్ ఇవ్వాలన్నదే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి

Read Latest Telangana News and Telugu News

Read more!

Updated Date - Jun 09 , 2024 | 06:47 PM

Advertising
Advertising