ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Sangareddy: ఘనంగా సోనియా గాంధీ జన్మదిన వేడుకలు.. జగ్గారెడ్డి ఏం చెప్పారంటే..

ABN, Publish Date - Dec 09 , 2024 | 03:11 PM

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నామని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి అన్నారు. పార్టీ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఆయన చెప్పారు.

TPCC Working President Jagga Reddy

సంగారెడ్డి: కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పరని, అందుకు నిదర్శనమే తెలంగాణ ఏర్పాటని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. తెలంగాణ ఎన్నికల వేళ ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నాయని ఆయన చెప్పారు. సంగారెడ్డి ఐబీ గెస్ట్ హౌస్‌లో సోనియాగాంధీ జన్మదిన వేడుకలను జగ్గారెడ్డి ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులతో పెద్దఎత్తున కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పోతురాజులతో కలిసి ఆయన నృత్యాలు చేశారు. బాణసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు.


ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి మాట్లాడుతూ.. " రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో శాసనసభ ఎన్నికల వేళ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు కట్టుబడి ఉన్నాం. కాంగ్రెస్ అగ్రనేతల మాటలు విశ్వసించి ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యి ఏడాది పూర్తయ్యింది. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభం అయ్యింది.


రైతు రుణమాఫీ హమీ సైతం దాదాపుగా పూర్తయ్యింది. రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ హామీ సైతం అమలవుతోంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మాట ఇస్తే తప్పే వ్యక్తులు కారు. ఒక రాష్ట్రంలో పార్టీకి, తమకు నష్టం జరుగుతుందని తెలిసినా తెలంగాణ ఏర్పాటు హామీని వారు నిలబెట్టుకున్నారు. హామీల విషయంలో ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. తెలంగాణ ప్రజలెవ్వరూ ప్రతిపక్ష నేతల మాటలు నమ్మవద్దని కోరుతున్నా" అని చెప్పారు.


కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నేడు సోనియా గాంధీ జన్మదిన వేడుకలను కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నారు. కేకులు కట్ చేస్తూ టపాసులు పేలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. సోనియా గాంధీ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చినందుకు ప్రత్యేక కృతజ్ఞతలు చెబుతున్నారు. సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

Hyderabad: మోహన్ బాబు ఇంటికి లేడీ బౌన్సర్లు.. మరోసారి ఘర్షణ జరిగే అవకాశం..

BJP vs Congress: మంత్రి కుర్చీలో బీజేపీ ఎమ్మెల్యే.. ప్రోటోకాల్‌పై శాసనసభలో నిరసన

Updated Date - Dec 09 , 2024 | 04:00 PM