ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

TG NEWS: వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతాం.. మైనంపల్లి మాస్ వార్నింగ్

ABN, Publish Date - Nov 08 , 2024 | 06:14 PM

కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కామని సంచలన ఆరోపణలు చేశారు. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతామని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు వార్నింగ్ ఇచ్చారు. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహా కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుందని ఆరోపణలు చేశారు.

సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ కోసం ఐదేళ్లు ఏం చేయలేదని..మాటలతో మభ్య పెట్టీ ఓట్ల రాజకీయం చేశారని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు సంచలన ఆరోపణలు చేశారు. ఇవాళ(శుక్రవారం) సిద్దిపేట పట్టణ పరిధిలోని టీహెచ్ఆర్ నగర్‌లో వివిధ పార్టీల నుంచి పలువురు నేతలు, కార్యకర్తలు మైనంపల్లి హనుమంతురావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా మైనంపల్లి హనుమంతరావు సమక్షంలో ఏసీపీ మధు కేక్ కట్ చేశారు.


జిల్లా కేంద్రంలో ఘనంగా సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో భాగంగా కేక్ కట్ చేసి మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, సిద్దిపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పూజల హరికృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంతురావు మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీలో చేరిన వారికి ఎలాంటి కష్టం వచ్చిన గుండెల్లో పెట్టుకుంటామని అన్నారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులుగా కాపాడుకుంటామని తెలిపారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కుటుంబ సభ్యులకు త్వరలోనే బట్టలు పంపిణీ చేస్తామని అన్నారు.


బతుకమ్మ చీరెలు పెద్ద స్కాం

‘‘నేడు రేవంత్ రెడ్డి జన్మదినం సందర్భంగా 10 చీరెలు పంపిణీ చేశా. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరెలు పెద్ద స్కాం. వచ్చే నాలుగేళ్లలో బీఆర్ఎస్ నేతలకు సినిమా చూపెడతాం. శ్రీలంక, బంగ్లాదేశ్ తరహాలో తెలంగాణ రాష్ట్రం కావద్దనే సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వ భూములను, వక్ఫ్ బోర్డు భూములను అమ్ముకుంది. బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లకు ఎదిగారు. కేసీఆర్ ప్రభుత్వం ఒక్కొక్కరిపై లక్షన్నర రూపాయలు అప్పు చేసింది. కేసీఆర్ హయాంలో సిద్దిపేటలో మాత్రమే అభివృద్ధి అయింది.. మిగతా నియోజక వర్గాలను ఎందుకు అభివృద్ధి చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో స్వేచ్ఛ ఉంది. గతంలో తెలంగాణను కల్వకుటుంబం దోచింది. పది కాలాల పాటు రేవంత్ ప్రభుత్వం ఉండాలి. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ కుటుంబానికి పదవులపై వ్యామోహం లేదు. ప్రాణాలు కోల్పోయింది మీరు సుఖ పడ్డది వారు. నాకు ఎవ్వరేమి ఇచ్చారనేది కాకుండా సమాజానికి మనం ఏం చేశామనేది ఆలోచన చేయాలి’’ అని మైనంపల్లి హనుమంతురావు పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

CM Revanth Reddy: యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్ కీలక నిర్ణయాలు

Bandi sanjay: తెలంగాణలో యాక్టివ్ సీఎం కేటీఆరే.. బండి సెన్సేషనల్ కామెంట్స్

KTR: మెఘా కృష్ణారెడ్డిని అరెస్ట్ చేసే దమ్ముందా..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 06:15 PM