ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Raghunandan Rao: మాకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది

ABN, Publish Date - Jun 20 , 2024 | 06:35 PM

బక్రీద్‌కు రెండు రోజుల ముందు మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్లు పోలీసుల వైఫల్యంతోనే అని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. ఈ అల్లర్లలో అరెస్టు అయిన బీజేపీ నేతల బెయిల్ పిటిషన్ ఈరోజు(గురువారం) దాఖలు చేశారు. వారి తరపున మెదక్ జిల్లా న్యాయస్థానంలో ఎంపీ, న్యాయవాది రఘునందన్ రావు వాదించారు.

Raghunandan Rao

మెదక్: బక్రీద్‌కు రెండు రోజుల ముందు మెదక్‌లో చోటుచేసుకున్న అల్లర్లు పోలీసుల వైఫల్యంతోనే అని ఎంపీ రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. ఈ అల్లర్లలో అరెస్టు అయిన బీజేపీ నేతల బెయిల్ పిటిషన్ ఈరోజు(గురువారం) దాఖలు చేశారు. వారి తరపున మెదక్ జిల్లా న్యాయస్థానంలో ఎంపీ, న్యాయవాది రఘునందన్ రావు వాదించారు.


ఈ సందర్భంగా రఘునందన్ మాట్లాడుతూ... పోలీసుల వైఫల్యాలను కోర్టు పెద్దలకు వివరించామని చెప్పారు. పిటిషన్ ఇచ్చిన వెంటనే పోలీసులు స్పందించి ఉంటే మెదక్‌లో అల్లర్లు జరిగేవి కావని తెలిపారు. న్యాయవ్యవస్థపై తమకు పూర్తి విశ్వాసం ఉందని చెప్పారు. బెయిల్ పిటిషన్‌పై విచారణ 21 కి వాయిదా వేశారన్నారు.


కార్యకర్తలకు కష్టమొస్తే అక్కడ రఘునందన్ ఉంటాడని అన్నారు. ఎంపీలకు సన్మానం ఉన్నా ..కార్యకర్తలకంటే ఎక్కువ సన్మానాలు కాదని ఇక్కడికి వచ్చానని అన్నారు. కార్యకర్తల కష్టంతోనే మెదక్ ఎంపీగా గెలిచానని తెలిపారు. వారికి ఎల్లవేళలా రుణపడి ఉంటానని ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2024 | 06:35 PM

Advertising
Advertising