TG News: రఘునందన్ ఆధారాలతో రావాలి.. సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి సవాల్
ABN, Publish Date - Jun 16 , 2024 | 03:17 PM
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి (Sarpanch Konyala BalReddy) అన్నారు. ములుగు మండల కేంద్రం లో బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట రామిరెడ్డిపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు (MP Raghunandan Rao) చేసిన ఆరోపణలు నిరాధారణమైనవని క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి (Sarpanch Konyala BalReddy) అన్నారు. ములుగు మండల కేంద్రంలో ఈరోజు(ఆదివారం) బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీడియా సమావేశం నిర్వహించారు. రఘునందన్ ఆధారాలు లేకుండా మాట్లాడుతూ గ్రామంలో కులాల , మతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదని అన్నారు.
వెంకటరామిరెడ్డి మీద ప్రజల ఆస్తులు ఉంటే తాము దేనికైనా సిద్ధమని రఘునందన్‌కు సవాల్ విసిరారు. 30 రోజుల్లో వెంకట రామిరెడ్డి ఆస్తులను వాపస్ తీసుకుంటానని ఎలా చెబుతున్నారని ప్రశ్నించారు . తాము ఆయనకు 60 రోజుల గడువు ఇస్తున్నామని.. ఆధారాలతో రాకపోతే రఘునందన్ రావు బేషరతుగా తన ఎంపీ పదవికి రాజీనామా చేయాలని క్షీరసాగర్ సర్పంచ్ కొన్యాల బాల్‌రెడ్డి సవాల్ విసిరారు.
ఈ వార్తలు కూడా చదవండి
KCR: 40 వేల కోట్ల భారం: ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
Hyderabad: ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్.. కారణమిదే..
For More Telangana News and Telugu News..
Updated Date - Jun 16 , 2024 | 04:26 PM