Rave Party: మంత్రి కాకాణి పేరుతో ఉన్న వాహనం తీసుకొచ్చింది ఎవరంటే..?
ABN, Publish Date - May 25 , 2024 | 03:08 PM
బెంగళూర్ రేవ్ పార్టీలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం.
హైదరాబాద్: బెంగళూర్ రేవ్ పార్టీలో (Rave Party) కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేవ్ పార్టీలో సినీ సెలబ్రిటీలు, ఇతరులు పాల్గొన్నారు. పార్టీలో ఆంధ్రప్రదేశ్ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి స్టిక్కర్ ఉన్న వాహనం ఉంది. మంత్రి, అతని సంబందీకులు ఎవరూ పార్టీలో పాల్గొనలేదని ప్రాథమిక సమాచారం. దీంతో అతని కారును ఎవరూ ఉపయోగించారు..? కారు అక్కడికి ఎలా వచ్చింది..? అనే ప్రశ్నలు తలెత్తాయి.
బెంగళూర్ రేవ్ పార్టీలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఉపయోగించిన కారును పూర్ణారెడ్డి అనే వ్యక్తి ఉపయోగించారని బెంగళూర్ పోలీసులు గుర్తించారు. పూర్ణారెడ్డిని శుక్రవారం నాడు బెంగళూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. తన పలుకుబడిని ఉపయోగించి పూర్ణారెడ్డి వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేశాడు. రేవ్ పార్టీ తనిఖీలు జరిగిన సమయంలో ఫామ్ హౌస్ నుంచి పూర్ణారెడ్డి పారిపోయారని పోలీసులు వెల్లడిచారు. సీసీటీవీ ఫుటేజీ చూసి అతనిని పట్టుకున్నారు. వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చేశారు.
రేవ్ పార్టీలో తెలుగు సినీ నటి హేమ పాల్గొన్నారు. పాల్గొనలేదని తొలుత బుకాయించారు. పాల్గొన్నట్టు కచ్చితమైన ఆధారాలు లభించడంతో కిమ్మనకుండా ఉండిపోయారు. రేవ్ పార్టీలో మొత్తం 101 మంది పాల్గొన్నారు. వారిలో 85 మంది డ్రగ్ వాడినట్టు రిపోర్ట్ వచ్చింది. అందులో నటి హేమ ఉన్నారు.
Updated Date - May 25 , 2024 | 03:08 PM