ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: కేసీఆర్ జైలుకు పోవడం ఖాయం.. కేసీఆర్‌పై కోమటిరెడ్డి ఆగ్రహం

ABN, Publish Date - Apr 05 , 2024 | 10:04 PM

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్( KCR) ఈరోజు కరీంనగర్‌ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఈరోజు కరీంనగర్‌ ‘పొలంబాట’ కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రి కోమటిరెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై కేసీఆర్‌కి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komati Reddy Venkat Reddy) కౌంటర్ ఇచ్చారు.

ఈ సందర్భంగా కేసీఆర్ ఆస్తులపై ప్రభుత్వం విచారణ జరపించాలని కోరారు. కేసీఆర్ జైలుకు పోవడం ఖాయమని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై లెక్క తేలాలన్నారు. లక్ష అబద్ధాలు ఆడి కేసీఆర్ పదేళ్లు పాలించారని ఎద్దేవా చేశారు.


Danam Nagender: ఐపీఎల్ టికెట్ల అమ్మకంపై ఎమ్మెల్యే దానం సంచలన వ్యాఖ్యలు

ఆయన కూతురు కవిత జైలుకు పోయిందన్న ఫ్రస్టేషన్‌లో ఉన్నారన్నారు. కుక్కలు, నక్కలు అని తమకు తిట్టొచ్చొని అన్నారు. కేసీఆర్ అవినీతి ఆస్తులు జప్తు చేసి జనాలకు పంచంతామని వార్నింగ్ ఇచ్చారు. కాళేశ్వరం అవినీతిపై క్యాబినెట్ తీర్మానం చేసి సీబీఐ ఎంక్వైరీ కోరతామన్నారు. గతంలో డబుల్ బెడ్ రూమ్‌ ఇళ్ల గురించి అడిగితే తనను శాసనసభ నుంచి బయటకు పంపారని అన్నారు. తాను తప్పు చేస్తే జైలు కు ఎందుకు పంపలేదని ప్రశ్నించారు. తాను తప్పు చేసినట్లు నిరుపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.


Shanti Swaroop: మూగబోయిన తొలి తెలుగు న్యూస్ రీడర్ స్వరం..

కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్ట: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

కేసీఆర్ అవినీతి అక్రమాలకు కాళేశ్వరం పరాకాష్టగా మారిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Sridhar Babu) అన్నారు. అధికారం పోయిందనే ఆవేదనలో కేసీఆర్ ఉన్నారని చెప్పారు.కాంగ్రెస్‌ని కొరికిసంపుతా అంటే ఏంటో కేసీఆర్ చెప్పాలని నిలదీశారు.


ఆయన ఇష్టమున్నట్లు మాట్లాడితే తమ క్యాడర్ చూసుకుంటుందని హెచ్చరించారు. ఇప్పటికే కొన్ని గ్యారంటీలను రాష్ట్రంలో అమలు చేశామని వివరించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత మిగిలిన గ్యారంటీలను అమలు చేస్తామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు.

Kishan Reddy: కాంగ్రెస్ మేనిఫెస్టోపై కిషన్ రెడ్డి వ్యంగ్యాస్త్రాలు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 05 , 2024 | 11:11 PM

Advertising
Advertising