2/3 వంతు చేరితే బీఆర్‌ఎస్‌ఎల్పీ విలీనమే
ABN, Publish Date - Jul 16 , 2024 | 03:38 AM
బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
గతంలో ఆ పార్టీ వాళ్లు ఇలాగే చేశారు కదా.. ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా వస్తున్నారు8 డీఎస్సీని రద్దు చేయించి బదనాం చేసే కుట్ర
మీడియాతో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి
ప్రజలిచ్చిన తీర్పును కాపాడుకుంటాం: పొన్నం
ఇష్టం లేకున్నా.. తప్పని పరిస్థితుల్లోనే చేరికలు
బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనానికి ముమ్మర యత్నం: మధుయాష్కీగౌడ్
మహబూబ్‌నగర్/కరీంనగర్/హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రె్‌సలోకి వచ్చే ఎమ్మెల్యేలందరూ స్వచ్ఛందంగా ఆయా నియోజకవర్గాల అభివృద్ధి కోసమే చేరుతున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. మూడింట రెండు వంతుల ఎమ్మెల్యేలు చేరిన తర్వాత సీఎల్పీలో బీఆర్‌ఎ్‌సఎల్పీ విలీనం అవుతుందని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ తరఫున గెలిచిన ఎమ్మెల్యేలను చేర్చుకొని సీఎల్పీ విలీనమైందంటూ బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడారని గుర్తు చేశారు. కానీ, ఇప్పుడు వారే తమను ప్రశ్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో ఆయన మాట్లాడారు. తమ మూడు నెలల పని తీరుకు లోక్‌సభ ఎన్నికలే రెఫరెండం అని చెప్పామని, అనుకున్న దాని కంటే సీట్లు తగ్గినా అసెంబ్లీతో పోల్చితే ఓటింగ్ శాతం పెరిగిందని గుర్తు చేశారు.
గత పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వడం బీఆర్‌ఎ్‌సకు చేతకాలేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత కోర్టు కేసులను పరిష్కరించి.. 30 వేల మందికి ఉద్యోగాలిచ్చామని చెప్పారు. పకడ్బందీగా డీఎస్సీ నిర్వహణకు తాము కసరత్తు చేస్తుంటే.. దాన్ని రద్దు చేయాలంటూ కొందరు డిమాండ్ చేయడం శోచనీయమన్నారు. నిరుద్యోగుల భవిష్యత్‌ను ఆగం చేయవద్దని బీఆర్‌ఎస్ నేతలను కోరారు. త్వరలోనే స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని, 65 పాలిటెక్నిక్ కళాశాలల్లో ఏటా 10 వేల మందికి వివిధ రంగాల్లో శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి సెప్టెంబరులో టెండర్లు పిలవనున్నామని, ఈ నెల 22న ట్రైపార్టీ అగ్రిమెంట్ జరగనుందని తెలిపారు.
కేటీఆర్‌కు మాట్లాడే అర్హతే లేదు
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామని బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు మాట్లాడుతుంటే చూస్తూ ఊరుకోవాలా? అని మంత్రి పొన్నం ప్రభాకర్ నిలదీశారు. తాము బాధ్యతలు చేపట్టకముందే ఈ సర్కారు కూలిపోతుందంటూ బీజేపీ, బీఆర్‌ఎస్ నేతలు వ్యాఖ్యానించారని గుర్తు చేశారు. ఫిరాయింపులకు కాంగ్రెస్ వ్యతిరేకమని, కానీ.. ప్రజలు ఇచ్చిన తీర్పును కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ఫిరాయింపులపై కేటీఆర్‌కు మాట్లాడే అర్హతే లేదని, బీఆర్‌ఎ్‌సలో చేరిన ఎమ్మెల్యేతో రాజీనామా చేయించకుండా మంత్రిని చేయలేదా? అని ప్రశ్నించారు. కరీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు.
చట్టంలోని వెసులుబాటు ప్రకారమే..
ఇష్టం లేకున్నా.. తప్పనిసరి పరిస్థితుల్లోనే ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నామని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీగౌడ్ తెలిపారు. ఆత్మరక్షణ కోసం ఏఐసీసీ అనుమతితోనే ఈ చేరికలు జరుగుతున్నట్లు తెలిపారు. సామాన్య రైతు కుంటుంబం నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి సీఎం కావడాన్ని కేసీఆర్ జీర్ణించుకోలేక పోతున్నారని దుయ్యబట్టారు. గాంధీభవన్‌లో ఆయన మాట్లాడారు. కాంగ్రె్‌సలో చేరే ఎమ్మెల్యేలకు ఎలాంటి పదవులు, హామీలు ఇవ్వట్లేదని, చట్టంలో ఉన్న వెసులుబాటు ప్రకారమే చేర్చుకుంటున్నామని తెలిపారు. దళిత నాయకుడు భట్టి అసెంబ్లీలో నిలదీస్తే కేసీఆర్ తట్టుకోలేకపోయారని, ఆ తర్వాతి సెషన్ వచ్చే సరికి 12మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్‌ఎ్‌సఎల్పీలో విలీనం చేసుకున్నారన్నారు. ఇప్పుడు బీఆర్‌ఎ్‌సను బీజేపీలో విలీనం చేసేందుకు కేటీఆర్, హరీశ్‌రావు ఢిల్లీలో చర్చలు జరిపారని, కేసీఆర్ కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
కవితను జైలు నుంచి విడిపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. అయితే, బీఆర్‌ఎ్‌సను విలీనం చేసుకునే అంశంలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మధ్య భేధాభిప్రాయాలు ఏర్పడ్డాయన్నారు. విలీనానికి కిషన్‌రెడ్డి ఓకే చెప్పారని, సంజయ్ మాత్రం హరీశ్‌ను లాక్కుని బీఆర్‌ఎ్‌సను చీల్చాలని చూస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగాలు కావాలనుకునే వాళ్లు పరీక్షల వాయిదాను కోరుకోరని, వాయిదే వేస్తే శిక్షణా సంస్థలు రూ.వంద కోట్ల మేర లబ్ధి పొందుతాయన్నారు. బీఆర్‌ఎస్ ఎంగిలి మెతుకులు తిన్న కొందరు బీసీలమని చెప్పుకుంటూ సచివాలయ ముట్టడి చేపట్టారని, వాళ్లు నిజమైన బీసీ ప్రతినిధులు కాదని అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే తీసకుంటానని, వేరే పదవి తీసుకోనని స్పష్టం చేశారు.
Updated Date - Jul 16 , 2024 | 06:46 AM