ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy: ‘నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే’.. కోమటిరెడ్డి ఎమోషనల్ టాక్

ABN, Publish Date - May 01 , 2024 | 04:07 PM

Telangana: నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘గల్లీ నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తా. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నా సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించిన’’...

Minister komatireddy venkatreddy

నల్గొండ, మే 1: నల్గొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Minister Komatireddy Venkatreddy) భావోద్వేగంగా ప్రసంగించారు. ‘‘గల్లీ నుంచి నన్ను ఢిల్లీ వరకు పంపిన మీకు నా చర్మం వలిచి చెప్పులు కుట్టించినా తక్కువే. కాంగ్రెస్ కార్యకర్తల కోసం నా ప్రాణాలైన ఇస్తా. నాకు కొడుకు లేడు.. మీరే నా వారసులు.. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నా సొంత డబ్బులతో 35 ఏసీలు పెట్టించిన. సీఎం వద్ద ఏ పని కావాలన్నా నేను చేసుకొస్తా.. భారీ మెజార్టీ మీరు ఇవ్వండి. కాబోయే ఎంపీ రఘు వీర్‌తో కలిసి సర్పంచ్ ఎన్నికల్లో మీ కోసం పని చేస్తాం. పేద పిల్లల చదువు బాధ్యత ప్రతీక్ పౌండేషన్ తీసుకుంటుంది’’ అని మంత్రి తెలిపారు.

Pawan Kalyan: చిరంజీవిని అవమానిస్తారా?.. జగన్‌కు టైం దగ్గరపడింది...


బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టే..

నీటి కరువుకు కారణం బీఆర్‌ఎస్ పార్టీనే అని ఆరోపించారు. 2004లో 33 కిలోమీటర్ల ఎస్‌ఎల్‌బీసీ పూర్తి చేస్తే కేసీఆర్ ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని విమర్శించారు. మూడేళ్లలో ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలో రెండు వందల ఎకరాల్లో పది వేల ఇల్లు కడుతామన్నారు. కేటీఆర్, కేసీఆర్ మానసిక పరిస్థితి దిగజారి పోయిందని వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌కు ఓటేస్తే మూసిలో వేసినట్టే అని అన్నారు. దేశంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందని, రాహుల్ ప్రధాని అవుతున్నారని ధీమా వ్యక్తం చేశారు. ఆగష్టు పదిహేనులోపు రైతు రుణమాఫీ చేయకపోతే దేనికైనా సిద్దమే అని సవాల్ విసిరారు. అగ్గిపెట్టె రావు మరోసారి మోసం చేసేందుకు వస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

CM Revanth: నా గడ్డ మీద నన్నే బెదిరిస్తావా.. రేవంత్ మాస్ వార్నింగ్

AP News: ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు పడ్డాయోచ్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 01 , 2024 | 04:25 PM

Advertising
Advertising