ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Konda Surekha: సోదర సమానుడు.. నూలు దండ వేస్తే తప్పా

ABN, Publish Date - Oct 01 , 2024 | 03:19 AM

జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే..

konda surekha

సోషల్‌మీడియాలో అసభ్యంగా ట్రోల్‌ చేస్తారా.. కన్నీళ్లు పెట్టుకున్న కొండా సురేఖ

  • బీఆర్‌ఎస్‌ ట్రోలింగ్‌ను క్షమించబోమంటూ ఫైర్‌

  • కేటీఆర్‌ను బట్టలు విప్పించి ఉరికిస్తామని హెచ్చరిక

  • సురేఖ.. అసౌకర్యానికి చింతిస్తున్నా: హరీశ్‌


హైదరాబాద్‌/బంజారాహిల్స్‌/సిద్దిపేటకల్చరల్‌, సెప్టెంబర్‌ 30 (ఆంధ్రజ్యోతి): జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా తాను మెదక్‌ వెళ్లినప్పుడు.. చేనేత కార్మికుల సమస్యలను చెబుతూ.. బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు గౌరవ సూచకంగా తనకు ఒక నూలు దండ వేస్తే.. దాన్ని బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా అసభ్యకరంగా ట్రోల్‌ చేసిందంటూ మంత్రి కొండా సురేఖ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ ట్రోలింగ్‌ చూసి గడిచిన రెండ్రోజులుగా తనకు అన్నం సహించడం లేదని, నిద్ర పట్టట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేటీఆర్‌, హరీశ్‌రావు ఇంట్లో ఆడవాళ్లపైనా ఇలాంటి ట్రోలింగ్‌ చేస్తే వారికెలా ఉంటుందని ప్రశ్నించారు. రఘునందన్‌రావు తనకు సోదర సమానుడని, ఆయన తనకు ఫోన్‌ చేసి బాధపడ్డారని వెల్లడించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టులో డీపీ హరీశ్‌రావుది ఉందన్నారు. తనపైన జరిగిన ట్రోలింగ్‌కు హరీశ్‌, కేటీఆర్‌లు క్షమాపణ చెప్పాలన్నారు.


క్షమించేది లేదు..

బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా ద్వారా ఇకపైన ఇలా ట్రోలింగ్‌లు చేస్తే క్షమించేది లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కార్యకర్తలు.. కేటీఆర్‌ బట్టలు విప్పించి బజారున ఉరికిస్తరని హెచ్చరించారు. తనపై అసభ్యకరంగా పెట్టిన పోస్టుపైన సైబర్‌ క్రైమ్‌లో ఫిర్యాదు చేశామని, సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికీ తీసుకెళ్లామని చెప్పారు. కాగా.. మీడియా సమావేశం ముగిసేలోపు సురేఖ పలుమార్లు భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు. ఇటు టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ కుమార్‌గౌడ్‌ స్పందిస్తూ.. ఎస్సీ, ఎస్టీ, బీసీ నేతలపైన సోషల్‌ మీడియా ద్వారా బీఆర్‌ఎస్‌ నేతలు దాడులు చేస్తున్నారని, ఈ వర్గాలు కన్నెర్ర చేస్తే వారెక్కడుంటారని ప్రశ్నించారు. సురేఖపై పోస్టులను కేటీఆర్‌ ఎందుకు ఖండించలేదని నిలదీశారు. కాగా, కొండా సురేఖపై ట్రోలింగ్‌లను నిరసిస్తూ తెలంగాణ భవన్‌ ముట్టడికి కాంగ్రెస్‌ ఇచ్చిన పిలుపు ఉద్రిక్తతకు దారి తీసింది. తెలంగాణ భవన్‌ వద్ద దిష్టిబొమ్మ దహనం చేసేందుకు యత్నించిన కాంగ్రెస్‌ కార్యకర్తలను బీఆర్‌ఎస్‌ నేతలు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.


వికృత చేష్టలను ఖండిస్తున్నా..: హరీశ్‌

సోషల్‌ మీడియాలో మంత్రి కొండా సురేఖను ట్రోల్‌ చేయడం, ఆమె కన్నీళ్లు పెట్టుకోవడంపై మాజీ మంత్రి హరీశ్‌రావు స్పందించారు. ‘కొండా సురేఖ గారు.. మీకు కలిగిన అసౌకర్యానికి నేనూ చింతిస్తున్నాను. సోషల్‌ మీడియా వేదికగా జరిగే ఈ వికృత చేష్టలను ఖండిస్తున్నా’ అని ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. మహిళలను గౌరవించటం మనందరి బాధ్యత, వారి పట్ల అగౌరవంగా ప్రవర్తిస్తే ఏ ఒక్కరు కూడా సహించబోరని స్పష్టం చేశారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ అయినా.. వ్యక్తిగతంగా తానైన ఉపేక్షించేది లేదన్నారు. సోషల్‌ మీడియాలో అందరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Oct 01 , 2024 | 07:38 AM