ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Ponguleti Srinivas: తెలంగాణకు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ మాత్రమే.. బీజేపీపై పొంగులేటి ఫైర్

ABN, Publish Date - May 06 , 2024 | 02:43 PM

Telangana: పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. రాష్ట్రానికి ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముల వారిని కూడా బీజేపీ రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలుకంటోందన్నారు.

Minister Ponguleti Srinivas Reddy

ఖమ్మం, మే 6: పదేళ్ల పాటు దేశాన్ని పరిపాలించిన బీజేపీ తెలంగాణకు చేసింది ఏమి లేదని.. రాష్ట్రానికి ఇచ్చింది ‘‘గాడిద గుడ్డు’’ మాత్రమే అంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Pongulet Srinivas Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. రాముల వారిని కూడా బీజేపీ (BJP) రాజకీయాల్లోకి తెచ్చిందని విమర్శించారు. తలంబ్రాల పేరుతో మరోసారి అధికారంలోకి రావాలని బీజేపీ కలలుకంటోందన్నారు. 400 సీట్లు బీజేపీకి ఇస్తే రాజ్యాంగాన్ని మార్చుతుందని తెలిపారు. రాజ్యాంగాన్ని మార్చితే రిజర్వేషన్‌లను ఎత్తివేస్తుందని వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నాయకులు నోరు తెరిస్తే పచ్చి అబద్దం చెప్తారని మంత్రి మండిపడ్డారు.

AP Elections: ఏపీలో మోదీ పర్యటనపై తెలు‘గోడు’ ఆసక్తి.. వరాలు ఉంటాయా..!?


మాజీ సీఎం కేసీఆర్ (Former CM KCR) ప్రజలను ప్రలోభపెట్టి ఏడు లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కేసీఆర్ తెలంగాణ ప్రజల సొమ్ము లక్షన్నర కోట్లు దోచుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులకు సంకెళ్లు వేసిన చరిత్ర ఉందని విమర్శించారు. కృష్ణా నీళ్లను ఆంధ్రకు ఇచ్చింది నిజమా కాదా అని ప్రశ్నించారు. కరెంట్ ఒక్క నిమిషం కూడా ఎక్కడా పోలేదని తెలిపారు. పార్లమెంటు ఎన్నికల తరువాత తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉండదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

Loksabha Polls: మీ ఓటు మరొకరు వేశారా..? ఇలా చేయండి..!!

Pawan Kalyan: పవన్‌తో పాటు మెగా ఫ్యామిలీపై ముద్రగడ సంచలన వ్యాఖ్యలు

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 06 , 2024 | 02:59 PM

Advertising
Advertising