ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: అలా చేస్తే బీజేపీ నేతలు గెలవరు: మంత్రి పొన్నం ప్రభాకర్

ABN, Publish Date - Apr 01 , 2024 | 04:49 PM

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని.. అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. 5 ఏళ్లలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు.

సిద్దిపేట జిల్లా: పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని.. అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు. 5 ఏళ్లలో కరీంనగర్ జిల్లా అభివృద్ధికి ఎంపీ బండి సంజయ్ ఏమి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని చెప్పారు. తాను జిల్లాను ఎలా చేశానో ప్రజల అందరికీ తెలుసునని చెప్పారు. సోమవారం నాడు కోహెడ మండలంలోని శనిగరం పెద్ద చెరువును ఆకస్మికంగా సందర్శించారు. శనిగరం గ్రామంలో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని , అక్కడ అవసరమైన బోర్ వేల్స్ వేసుకోవడంతో పాటు అదనపు మోటార్లు ఏర్పాటు చేసుకోవాలని గ్రామ సెక్రెటరీతో పాటు స్పెషల్ ఆఫీసర్లకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే లోపు పాఠశాలల్లో తరగతి గదులకు కలర్స్ వేయడంతో పాటు టాయిలెట్స్ నిర్మాణం చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎండాకాలంలో ఈసారి ముందుగానే భూగర్భ జలాలు పడిపోయాయన్నారు. కాంగ్రెస్ (Congress) కరువు తెచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటున్నారని.. కానీ బీఆర్ఎస్ తెచ్చిన కరువు ఇదని ఎద్దేవా చేశారు. గ్రామానికి , మండలానికి, నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలకు ఏ సమస్య వచ్చిన తాను 24×7 ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రతి గ్రామగ్రామాన పర్యటించి సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. కొంతమంది భూ పంచాయతీలల్లో తనను ఇన్వాల్వ్ చేస్తున్నారని.. వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 01 , 2024 | 04:49 PM

Advertising
Advertising