ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Loksabha polls 2024: కరెంట్ పోయిందంటూ అబద్దాలు చెబుతున్నారు.. కేసీఆర్‌పై తుమ్మల ఆగ్రహం

ABN, Publish Date - Apr 30 , 2024 | 02:17 PM

Telangana: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఈ రాష్ట్రంలో పాలనను చిందరవందరగా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసి, అస్తవ్యస్తం చేసిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

Minister Tummala Nageshwar rao

ఖమ్మం, ఏప్రిల్ 30: బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌పై (BRS Chief KCR) మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Minister Tummala Nageshwar Rao) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. మంగళవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత పాలకులు ఈ రాష్ట్రంలో పాలనను చిందరవందరగా చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి, ఆర్థిక దోపిడీ చేసి, అస్తవ్యస్తం చేసిన ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్క రైతుకి రైతుబంధు అందజేస్తామని స్పష్టం చేశారు.

AP Elections: బంపర్ ఆఫర్.. కూపన్ నింపితే లక్ష మీదే..


‘‘నాగార్జునసాగర్ నీళ్లు ఎందుకు రాలేదని నిన్న ఓ పెద్దమనిషి వచ్చి అడుగుతున్నాడు. నువ్వు జూన్, జూలై, ఆగస్టులో ఇవ్వలేదు. సెప్టెంబర్‌లో ఇవ్వలేదు. ఇప్పుడు నీళ్లు లేవు అంటున్నావు.. మరి నువ్వు ఎందుకు ఇవ్వలే. రాష్ట్రంలో కరెంటు పోయిందని కథలు చెప్తున్నాడు. 10 ఏళ్లుగా అబద్ధాలు చెప్పావు. ఇంకా అబద్ధాలు చెప్తే ప్రజలు నమ్మరు. ఇకనైనా అబద్దాలు చెప్పడం మానేయ్’’ అంటూ బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను ఉద్దేశించి తుమ్మల పరోక్షంగా విమర్శలు గుప్పించారు.

Amit Shah: రాజకీయాల్ని దిగజారుస్తున్నారంటూ.. నకిలీ వీడియోపై తీవ్రంగా మండిపడ్డ అమిత్ షా


వారికే నా మొదటి ప్రాధాన్యత..

తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీకి (Sonia Gandhi) అంతా అండగా ఉందామని పిలుపునిచ్చారు. ‘‘మీ అందరి కష్టంతో.. మీ సహకారంతో.. మీ కృషితో మేమందరం నేడు ఈ స్థానంలో ఉన్నాము. మొట్టమొదటి నుంచి కాంగ్రెస్ జెండా మోసిన ప్రతి ఒక్క కార్యకర్తని గౌరవంగా చూసుకుంటాం. మీ అనుమతి లేకుండా కొత్తగా ఎవరిని పార్టీలో చేర్చుకోము. 40 ఏళ్లుగా కాంగ్రెస్ జెండాను మోసి పార్టీ కోసం జీవితాన్ని త్యాగం చేసిన కార్యకర్తకే నా మొదటి ప్రాధాన్యత. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ చిరస్థాయిగా ఉంటుంది. అందరం క్రమశిక్షణతో నడుచుకుందాం. క్రమశిక్షణ తప్పి మాట్లాడితే అది మనకు, మన పార్టీకి అవమానం. ఈ విషయాన్ని మర్చిపోవద్దు. కాంగ్రెస్ కార్యకర్త కూడా చిరస్థాయిగా నిలబడి ఉంటాడు. జిల్లా అభివృద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేసి చూపిస్తాం’’ అని మంత్రి స్పష్టం చేశారు.

Junk Food: జంక్ ఫుడ్ తిని అస్వస్థత.. ఏ ఔట్ లెట్ నుంచి బుక్ చేశారో తెలుసా..?


రాహుల్‌ను ప్రధానిని చేసుకుందాం...

ఈ దేశం కోసం దేశ ప్రజల కోసం ప్రాణాలు పణంగా పెట్టిన గాంధీ కుటుంబం కోసం పని చేద్దామన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిద్దామని.. రాహుల్ గాంధీని (Rahul Gandhi) ప్రధానమంత్రి చేసుకుందామని కార్యకర్తల సమావేశంలో మంత్రి పిలుపునిచ్చారు. ఈ దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన కుటుంబం రాహుల్ గాంధీ కుటుంబం అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

High Court: జనసేన గాజు గ్లాస్ గుర్తుపై హైకోర్టులో విచారణ

Viral Video: వామ్మో.. రస్క్ తింటే రిస్కే.. వైరల్ అవుతున్న ఆ వీడియోలో రస్క్‌లను ఎలా తయారు చేస్తున్నారో చూస్తే..!

Read Latest Telangana News And Telugu News

10th ఫలితాల కోసం క్లిక్ చేయండి...

Updated Date - Apr 30 , 2024 | 02:47 PM

Advertising
Advertising