KTR: కాంగ్రెస్‌కు డేంజర్ బీఆర్‌ఎస్‌తో కాదు.. నల్గొండ, ఖమ్మం నేతలతోనే
ABN, Publish Date - Apr 01 , 2024 | 02:36 PM
Telangana:బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడి పోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ ఓటేయాలని.. రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు ఓటేయాలన్నారు.
నల్గొండ, ఏప్రిల్ 1: బీఆర్‌ఎస్ చీఫ్ కేసీఆర్ (BRS Chief KCR) నిన్నటి పర్యటన వీడియోలు చూస్తే నల్గొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో తెలియడం లేదని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR) అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల నిజం ముందు వంద రోజుల అబద్దాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. మోసపోయినోళ్లు బీఆర్ఎస్ (BRS) ఓటేయాలని.. రుణమాఫీ వచ్చినోళ్లు కాంగ్రెస్‌కు (Congress) ఓటేయాలన్నారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతామన్నా కోమటిరెడ్డి అహంకారాన్ని ఓటుతో కొట్టాలని కోరారు.
Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!
కరెంటు, నీళ్లు ఇవ్వక పోయినా, పంటలు ఎండినా కాంగ్రెస్‌కే ఓటు వేస్తే ఐదేళ్లు తప్పించుకుంటారన్నారు. కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌తో డేంజర్ లేదని... నల్గొండ, ఖమ్మం నాయకులతోనే అని అని వ్యాఖ్యలు చేశారు. ఏక్ నాథ్ షిండేలు ఉంది కాంగ్రెస్ పార్టీలోనే అని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి పదవి ఇస్తే బీజేపీలోకి వస్తా అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చెవిలో గుసగుసలు వినిపించారన్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Congress: కేసీఆర్ కుటుంబం తప్పా మిగతా నేతలు కాంగ్రెస్‌లో చేరడానికి సిద్దం: ఉత్తమ్ కుమార్ రెడ్డి
Big Breaking: కడప పార్లమెంట్ బరిలో వైఎస్ షర్మిల.. అధికారిక నిర్ణయం వచ్చేసింది!
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Apr 01 , 2024 | 03:11 PM