TG NEWS: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. పదిమందికి తీవ్ర గాయాలు
ABN, Publish Date - Dec 20 , 2024 | 07:36 AM
డ్రైవర్ నిద్రమత్తు కారణంగా పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. నల్గొండ జిల్లాలో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాళ్ల కుప్పను ఢీకొట్టి ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది.
నల్గొండ: డ్రైవర్ నిద్రమత్తు కారణంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే... నల్గొండ జిల్లాలో ఇవాళ(శుక్రవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడి పదిమంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి.
ఈ సంఘటన మిర్యాలగూడలో అద్దంకి- నార్కట్‌పల్లి హైవేకు దగ్గరలోని నందిపాడు సమీపంలో అదుపు తప్పి రాళ్ల కుప్పను ఢీకొంది. క్షతగ్రాతులను మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఒంగోలు నుంచి 35 మంది ప్రయాణికులతో కావేరి ప్రైవేట్ ట్రావెల్ బస్సు హైదరాబాద్ వెళ్తుంది. అతి వేగం, డ్రైవర్ నిద్ర మత్తులో డ్రైవ్ చేయడమే ప్రమాదానికి గల కారణమని ప్రయాణికులు చెబుతున్నారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి
Lagacharla Case: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
NTR Statue: ఓఆర్‌ఆర్ వద్ద వంద అడుగుల ఎన్టీఆర్ విగ్రహం
Read Latest Telangana News and Telugu News
Updated Date - Dec 20 , 2024 | 08:28 AM