మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Komatireddy: కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడు.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి హెచ్చరిక

ABN, Publish Date - Apr 17 , 2024 | 01:49 PM

Telangana: ‘‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్... దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని టచ్ చేస్తే హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు.

Komatireddy: కాంగ్రెస్‌ను టచ్ చేసి చూడు.. కేసీఆర్‌కు కోమటిరెడ్డి హెచ్చరిక
Minister komatireddy venkatreddy warn KCR

నల్గొండ, ఏప్రిల్ 17: ‘‘ఏడాదిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదనే కేసీఆర్... దోపిడీతో మా ఎమ్మెల్యేలను కొనాలని చూస్తున్నారా’’ అంటూ మాజీ ముఖ్యమంత్రికి (BRS Chief KCR) మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి (Minister Komatireddy Venkatreddy) క్వశ్చన్ చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడిన మంత్రి.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ పార్టీని (Congress) టచ్ చేస్తే హైదరాబాద్‌లో (Hyderabad) బీఆర్ఎస్ పార్టీ (BRS) ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీ 30 మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నా తాము వద్దంటున్నామన్నారు. కాంగ్రెస్ అనుకుంటే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా బీఆర్‌ఎస్ పార్టీలో ఉండరని సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రిని లిల్లీ పుట్ అంటారా.... ప్రజల నుంచి వచ్చిన నాయకుడు రేవంత్ రెడ్డి... దొంగ పాస్ పోర్ట్‌లు చేయలేదు అంటూ వ్యాఖ్యలు చేశారు.

AP News: జగన్‌పై రాయి దాడి ఘటనలో మరొకరి అరెస్ట్.... ఇదెక్కడి దారుణమంటున్న కుటుంబీకులు


ఇకపై మేమూ వెంటాడుతాం...

విటమిన్ డీ తీసుకొని కేసీఆర్ దొంగ దీక్షలు చేసి చావు నోట్లో తలపెట్టి ఉద్యమం చేశానని చెప్పుకుంటారా అంటూ మండిపడ్డారు. కవిత జైలుకు పోయినా బుద్ది మారలేదా అని ప్రశ్నించారు. అవినీతి చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడలో రైస్ మిల్లుల దగ్గరికి తాను వెళ్ళాక రైతుల ధాన్యం రూ.2500 కొన్నారన్నారు. రేవంత్ రెడ్డి ముఖం చూసే ధైర్యం లేకనే రెండు సార్లు కేసీఆర్ అసెంబ్లీకి రాలేదన్నారు. 12-13 సీట్లలో కాంగ్రెస్ గెలుస్తుందని... బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటూ రాదన్నారు. కవిత జైలుకు పోయాక కేసీఆర్‌కు మెంటలా ఉందని.. అందుకే రేవంత్ బీజేపీలోకి పోతున్నారని అంటున్నారని మండిపడ్డారు. రెండేళ్లయినా కవితకు బెయిల్ రాదన్నారు. కేసీఆర్ కట్టె పట్టుకొని వేటాడుతాం అంటున్నారని.... రేపటి నుంచి తామూ వెంటాడుతామంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Bhadrachalam: సీతమ్మ మెడలో పుస్తె కట్టిన రామయ్య.. భద్రాద్రిలో సీతారాముల కళ్యాణం కమనీయం

Lok Sabha election 2024: ఎల్లుండి తొలి దశ పోలింగ్: నేటితో ప్రచారానికి తెర

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 17 , 2024 | 03:40 PM

Advertising
Advertising