Share News

PV Sindhu: శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు

ABN , Publish Date - Dec 28 , 2024 | 04:38 AM

నూతన దంపతులు, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు.

PV Sindhu: శ్రీవారిని దర్శించుకున్న పీవీ సింధు దంపతులు

తిరుమల, డిసెంబరు27(ఆంధ్రజ్యోతి): నూతన దంపతులు, స్టార్‌ షట్లర్‌ పీవీ సింధు, వెంకట దత్తసాయి శుక్రవారం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి ఆశీస్సులు అందుకున్నారు. ఇటీవల ఏడడుగులు వేసి ఒక్కటైన ఈ జంట గురువారం రాత్రి కాలినడకన తిరుమల చేరుకున్నారు. శుక్రవారం వేకువజాము జరిగిన అభిషేక సేవలో పాల్గొని శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం పీవీ సింధు ఆలయం ముందు మీడియాతో మాట్లాడుతూ.. ఏటా శ్రీవారి దర్శనానికి రావడం తనకు అలవాటన్నారు. పెళ్లి జరిగిన నేపథ్యంలో తన భర్తతో కలిసి శ్రీవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందానన్నారు.

Updated Date - Dec 28 , 2024 | 04:38 AM