High Court: ‘దానం’పై అనర్హత వేటు వేసేలాస్పీకర్‌ను ఆదేశించండి
ABN, Publish Date - Jul 13 , 2024 | 04:08 AM
పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు.
హైకోర్టులో బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి పిటిషన్
హైదరాబాద్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): పార్టీ మారిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌కు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ బీజేపీకి చెందిన నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. దానం నాగేందర్ బీఆర్‌ఎస్ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి ఆ పదవికి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌లో చేరారని తెలిపారు.
ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని ఉల్లంఘించినట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనపై అనర్హత పిటిషన్ సమర్పించేందుకు వెళ్లగా స్పీకర్ అందుబాటులో లేరని తెలిపారు. ఈ పిటిషన్ సోమవారం జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చే అవకాశం ఉంది.
Updated Date - Jul 13 , 2024 | 04:08 AM