ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

ABN, Publish Date - Mar 30 , 2024 | 12:27 PM

తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.

తెలంగాణ(Telangana)లో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ (BRS) మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు. మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవిపై సొంత పార్టీ కౌన్సిలర్లే తిరుగుబాటు చేశారు. అవిశ్వాసానికి పరోక్షంగా 9 మంది బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు సహకరించారు. మొత్తం 49 మంది కౌన్సిలర్లకు గానూ, కాంగ్రెస్‌కు 27, టీఆర్‌ఎస్‌కు 16, బీజేపీకి ఆరుగురు ఉన్నారు.

Congress: నేడు కాంగ్రెస్‌లోకి బీఆర్ఎస్ కీలక నేతలు..

బీఆర్ఎస్ కౌన్సిలర్ల మద్దతు

అవిశ్వాస తీర్మానం సమయంలో కోరం సరిపోక పోవడంతో కాంగ్రెస్ కు అనుకూలంగా 9మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు హాజరయ్యారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తితో ఉన్న ఈ 9మంది కౌన్సిలర్లు ప్రత్యేక క్యాంపు నుంచి నేరుగా సమావేశానికి హాజరయ్యారు. బలపరీక్షలో జాహ్నవిని ఓడించడానికి ముందుగానే స్కెచ్ వేయగా.. వీరికి బీఆర్‌ఎస్‌కు చెందిన ముఖ్య నేత అండగా నిలిచినట్లు తెలుస్తోంది. అవిశ్వాసానికి అనుకూలంగా 27 మంది చేతులు ఎత్తడంతో తీర్మానం నెగ్గింది. దీంతో కొత్త ఛైర్మన్‌గా గడ్డం ఇందుప్రియను ఎన్నుకున్నారు. బీజేపీ కౌన్సిలర్లు సమావేశానికి హాజరుకాలేదు. ఇందుప్రియ కామారెడ్డి 8వ వార్డు కౌన్సిలర్‌గా ఉన్నారు. ఆమె అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీఆర్‌ఎస్ ఛైర్‌పర్సన్‌పై అవిశ్వాసం నెగ్గడంతో కాంగ్రెస్ కార్యకర్తలు మున్సిపల్ కార్యాలయం బయట టపాసులు కాల్చి స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని పంచుకున్నారు.

KTR: కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదు..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 30 , 2024 | 12:34 PM

Advertising
Advertising