ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleshwaram: మేడిగడ్డ బ్యారేజీలో కొనసాగుతున్న పరీక్షలు

ABN, Publish Date - Jun 09 , 2024 | 04:25 AM

మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్‌ చేపడుతున్నారు.

మహదేవపూర్‌ రూరల్‌ జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో సీఎ్‌సఎంఆర్‌ఎ్‌స(సెంట్రల్‌ సాయిల్‌ అండ్‌ మెటీరియల్‌ రీసెర్చ్‌ స్టేషన్‌) బృందం పరీక్షలు నాలుగో రోజైన శనివారం కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లరుతోపాటు గేట్ల ముందున్న బే ఏరియాల్లో డ్రిల్లింగ్‌ చేపడుతున్నారు. తాత్కాలిక మరమ్మతుల్లో భాగంగా చేపట్టిన ఇసుక, సిమెంట్‌ గ్రౌటింగ్‌, షీట్‌పైల్స్‌ అమరిక, సీసీ బ్లాకుల రీఆరెంజ్‌మెంట్‌ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఏడో బ్లాక్‌లోని 22వ గేటును సుమారు 100.50 మీటర్ల మేర శనివారం సాయంత్రం ఎత్తారు. 7వ బ్లాక్‌లో మొత్తం 11 గేట్లుండగా నాలుగు గేట్లను బ్యారేజీ కుంగిన మరుసటి రోజే ఎత్తారు.


మే 17న 15వ నెంబరు గేటును ఎత్తి, తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు గత బుధవారం సాయంత్రం అదే బ్లాకులోని 16,17 గేట్లను ఎత్తారు. 20,21 గేట్లను కట్‌ చేసి తొలగించే పనులు చేపడుతున్నారు. 19 నెంబరు గేటును ఎత్తాల్సి ఉంది. ఇక, అన్నారం బ్యారేజీలో చేపట్టిన గ్రౌటింగ్‌ పనులు శనివారంతో పూర్తయ్యాయి. బ్యారేజీలోని 28,38,35,44 వెంట్లలో డ్రిల్లింగ్‌ చేపట్టి మట్టి నమూనాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. 25 మీటర్ల మేర డ్రిల్లింగ్‌ చేపట్టి.. నమూనాలను పూణేకు చెందిన సీడబ్యూపీఆర్‌ఎ్‌స నిపుణులకు పంపించి పరీక్షలు చేయించనున్నారు. బ్యారేజీకి దిగువన చేపట్టిన సీసీ బ్లాకుల రీఆరెంజ్‌మెంట్‌ పనులు, బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న ఇసుక తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.

Read more!

Updated Date - Jun 09 , 2024 | 04:25 AM

Advertising
Advertising