Nutritious food: ఆరోగ్యకర ఆహారం అందడం లేదు!
ABN, Publish Date - Jul 27 , 2024 | 04:11 AM
మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్ ఇన్ ద వరల్డ్’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది.
దేశంలో 55.6ు జనాభా పరిస్థితి ఇది
ప్రపంచంలో ప్రతి 11 మందిలో ఒకరికి క్షుద్బాధ: సోఫీ నివేదిక
హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): మన దేశ జనాభాలో సగం మందికి పైగా ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఇలాంటి వారు 55.6 శాతం మంది ఉన్నారని ఐరాసకు చెందిన ‘స్టేట్ ఆఫ్ ఫుడ్ సెక్యూరిటీ అండ్ న్యూట్రిషియన్ ఇన్ ద వరల్డ్’ (సోఫీ) నివేదికలో వెల్లడించింది. ఇది దక్షిణాసియా దేశాల సగటు(53.1) కంటే ఎక్కువగా ఉందని పేర్కొంది. 2017లో మన దేశంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోలేని వారి శాతం 69.5గా ఉందని వెల్లడించింది. 2021-23 మధ్య కాలంలో 19.46 కోట్ల మంది పోషకాహార లోపంతో బాధపడ్డారని తెలిపింది. మన పొరుగు దేశమైన పాకిస్థాన్‌లో 58.7శాతం మంది ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం లేదని పేర్కొంది.
సోఫీ నివేదికలో కొన్ని ముఖ్యాంశాలు..
ప్రపంచంలో ప్రతి 11మందిలో ఒకరు ఆకలితో బాధపడుతున్నారు. ఆఫ్రికాలో ప్రతి ఐదుగురిలో ఒకరిది ఈ పరిస్థితి.
తక్కువ బరువుతో జన్మించేవారు, బాల్యంలో అఽధిక బరువుతో బాధపడేవారి సంఖ్య ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా స్తబ్ధుగా ఉంది. అయితే 15-49 వయసు మహిళల్లో రక్తహీనత పెరిగింది. 2012లో ఇది 28.5ు ఉండగా 2019 నాటికి 29.9 శాతానికి చేరుకుంది. ఈ దశాబ్దం చివరికి అది 32.3 శాతానికి పెరుగుతుందని అంచనా.
ఇక ఐదేళ్లలోపు చిన్నారుల్లో వయసుకు తగ్గ ఎత్తు లేకపోవడమనేది 2012లో 26.3 శాతం ఉండగా.. 2022 నాటికి 22.3 శాతానికి తగ్గింది. ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడమనేది కూడా 2012లో 7.5 శాతం ఉండగా, 2022నాటికి 6.8 శాతానికి తగ్గింది.
2022లో ప్రపంచ జనాభాలో 280 మంది కోట్ల మంది ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోలేని స్థితిలో ఉన్నారు. ఇది అధికాదాయం ఉన్న దేశాల్లో 6.3శాతం, మధ్యస్థ ఆదాయదేశాల్లో 21.5శాతం, తక్కువ ఆదాయమున్న దేశాల్లో 52.6 శాతం, అల్పాదాయ దేశాల్లో 71.5శాతంగా నమోదైంది.
2030 నాటికి ప్రపంచవ్యాప్తగా 58.2 కోట్ల మంది దీర్ఘకాలిక పోషకాహార లోపంతో బాధపడతారు. ఇందులో సగానికిపైగా ఆఫ్రికా దేశాల్లోనే ఉంటారు.
ఆహార కొరత 2019లో 9.1 శాతం ఉండగా.. 2020 నాటికి 10.6 శాతానికి పెరిగింది.
2012లో ప్రపంచ జనాభాలో 12.1 శాతం ఊబకాయులు ఉండగా.. అది 2022 నాటికి 15.8 శాతానికి పెరిగిందని నివేదిక వెల్లడించింది.
Updated Date - Jul 27 , 2024 | 04:11 AM