ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kishan Reddy: రాష్ట్రంలో నిస్సిగ్గుగా ఫిరాయింపులు..

ABN, Publish Date - Jul 13 , 2024 | 04:28 AM

రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడిరోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు.

  • నడిరోడ్డుపై రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు

  • గాంధీభవన్‌, తెలంగాణ భవన్‌ల మధ్య తేడా లేదు

  • రాష్ట్రాన్ని దోచి ఢిల్లీకి సూట్‌కేసులు పంపుతున్నారు

  • సీఎం రేవంత్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ధ్వజం

  • కేసీఆరే ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లోకి పంపుతున్నారు

  • రాహుల్‌.. దమ్ముంటే ఓయూకు రా: సంజయ్‌

  • బీజేపీ అధికారంలోకి వస్తే కార్యకర్తే సీఎం: ప్రధాన్‌

  • ఇంజనీరింగ్‌, వైద్య కళాశాలల నుంచీ

  • ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌.. అందుకే అధిక ఫీజులు: ఈటల

హైదరాబాద్‌, జూలై 12 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని సీఎం రేవంత్‌పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. ముఖ్యమంత్రి రాజ్యాంగాన్ని నడిరోడ్డుపై అవహేళన చేస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం, రాష్ట్రాన్ని దోపిడీ చేసి ఢిల్లీకి సూట్‌కేసులు పంపించడం మాత్రమే జరుగుతున్నాయని చెప్పారు. పార్టీ ఫిరాయించినవారిని అనర్హులుగా ప్రకటించాలంటూ ఎన్నికల ముందు న్యాయ్‌పత్ర్‌లో పేర్కొన్న కాంగ్రెస్‌, ఇప్పుడు ఫిరాయింపులను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు. ఈ విషయంలో బీఆర్‌ఎస్‌ కంటే తామేం తక్కువ కాదన్నట్లుగా సీఎం వ్యవహరిస్తున్నారని కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు.


అప్పులు చేయడం, భూములు, మద్యం అమ్మకాలతోనే రాష్ట్ర ప్రభుత్వం నెట్టుకొస్తోందని విమర్శించారు. బెల్టు షాపులను ఎత్తివేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక వాటి సంఖ్య పెంచేశారని ఆరోపించారు. శుక్రవారం శంషాబాద్‌లో కిషన్‌రెడ్డి అధ్యక్షతన బీజేపీ రాష్ట్రస్థాయి విస్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ హాజరయ్యారు. కేంద్ర మంత్రి బండి సంజయ్‌, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్ర పదాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులు, భవిష్యత్తు కార్యాచరణ, స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ సమావేశంలో చర్చించారు. బీజేపీ సభ్యత్వం, సంస్థాగత ఎన్నికలు, లోక్‌సభ ఎన్నికల ఫలితాలపైనా చర్చ జరిగింది. సమావేశంలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విచిత్ర రాజకీయ పరిస్థితి కొనసాగుతోందన్నారు.


బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఒక్కటేనని.. ఆ రెండు పార్టీల డీఎన్‌ఏ ఒక్కటేనని, కవలపిల్లలని వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌, తెలంగాణ భవన్‌ మధ్య తేడా లేదన్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నాడు కేసీఆర్‌ కూటమి పార్టీలకు నిధులు పంపిస్తే, ఇప్పుడు కాంగ్రెస్‌ పార్టీ ఢిల్లీకి సూట్‌కేసులు పంపిస్తోందని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎ్‌సలో చేరితే, ఇప్పుడు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కాంగ్రె్‌సలో చేరుతున్నారని చెప్పారు. నిండు సభలో ‘జైపాలస్తీనా’ అని నినాదం చేసిన ఒవైసీకి కొమ్ముకాస్తున్నందుకు కాంగ్రెస్‌, బీఆర్‌ఎ్‌సలకు సిగ్గుండాలన్నారు. తాము రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోబోమని చెప్పారు. తెలంగాణలో కాంగ్రె్‌సకు బీజేపీయే ప్రత్యామ్నాయం అని ప్రజలు తీర్పు ఇచ్చారని తెలిపారు. త్వరలో సభ్యత్వ నమోదుకు సిద్ధం కావాలని కిషన్‌రెడ్డి పార్టీ నాయకులకు పిలుపునిచ్చారు.


దమ్ముంటే భద్రత లేకుండా ఓయూకి వెళ్లండి..

బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందని ఆరోపించిన కాంగ్రెస్‌ నేత రాహుల్‌, దమ్ముంటే ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ)కి భద్రత లేకుండా వెళ్లాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సంజయ్‌ సవాల్‌ చేశారు.బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆరే తన ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి పంపిస్తున్నారని వ్యాఖ్యానించారు. బీజేపీ అధికారంలోకి వస్తే తమకు పుట్టగతులు ఉండవని కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ నాయకులు గుర్తించారని.. అందుకే కేసీఆర్‌ తన ఎమ్మెల్యేలను కాంగ్రె్‌సలోకి పంపిస్తున్నారని చెప్పారు. కేంద్రంలో వరసగా మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీని అభినందిస్తూ, లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని 8 స్థానాల్లో గెలిపించినందుకు రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తూ సంజయ్‌ ‘సెల్యూట్‌ తెలంగాణ’ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.


‘మీరు కష్టపడి మమ్మల్ని గెలిపించారు. ఇక మిమ్మల్ని ప్రజాప్రతినిధులుగా చేయడమే మా లక్ష్యం’ అని పార్టీ నాయకులనుద్దేశించి సంజయ్‌ వ్యాఖ్యానించడంతో సభలో హర్షధ్వానాలు చేశారు. ఈ తీర్మానాన్ని మహబూబ్‌నగర్‌ ఎంపీ, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ బలపరిచారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అనతికాలంలోనే నిరుద్యోగ యువత విశ్వాసాన్ని కోల్పోయిందని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు రావడం లేదని.. సీఎం, ఆర్థిక మంత్రి చెబితేనే బిల్లులు ఇస్తామని అధికారులు అంటున్నారని తెలిపారు. 8 శాతం డబ్బులు ముందు ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారనిచెప్పారు. ఇంజనీరింగ్‌, మెడికల్‌ కాలేజీల నుంచి ట్రిపుల్‌ ఆర్‌ ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారన్నారు. అందుకే కాలేజీలు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయన్నారు.


సామాన్య కార్యకర్తే సీఎం: ఽ ప్రధాన్‌

రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే సామాన్య కార్యకర్త సీఎం అవుతారని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అన్నారు. వచ్చే ఎన్నికల తర్వాత తెలంగాణలో బీజేపీ ముఖ్యమంత్రి ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ మూడు నుంచి రెండో స్థానానికి చేరిందని, ఇక నంబర్‌ వన్‌ స్థానమే లక్ష్యమని చెప్పారు. పార్టీ నాయకులంతా కష్టపడి 2028లో రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని కోరారు. 35 వేల పోలింగ్‌ బూత్‌లను పటిష్ఠం చేయాలని, యువతను పార్టీలో చేర్పించాలని సూచించారు. పార్టీలో పాత, కొత్త లేదని.. ఎంపీ ఈటల రాజేందర్‌ పాత నేత అయిపోయారని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా కాంగ్రె్‌సకు 13 రాష్ట్రాల్లో ఒక్క ఎంపీ కూడా లేరన్నారు. మిత్రపక్షాలు దూరమైతే కాంగ్రె్‌సకు 50 సీట్లు కూడా వచ్చేవి కాదని చెప్పారు.

Updated Date - Jul 13 , 2024 | 04:28 AM

Advertising
Advertising
<