ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 03 , 2024 | 09:31 PM

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు.

హైదరాబాద్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఏదైనా మాట్లాడే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. తుక్కుగూడలో కాంగ్రెస్ (Congress) తలపెట్టిన భారీ బహిరంగ సభ ఏర్పాట్లను బుధవారం నాడు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్ తమ ప్రభుత్వంపై అవాకులు, చెవాకులు పెలితే చూస్తు ఊరుకోమని హెచ్చరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నేతలను ఓడించడం ఖాయమన్నారు. ఫోన్ ట్యాపింగ్ అంశం సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తున్నారని అన్నారు. తన ఫోన్‌తో పాటు తన సిబ్బంది, చివరకు డ్రైవర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ చేశారని మండిపడ్డారు.


KTR: కేసీఆర్ అంటే నీళ్లు.. కాంగ్రెస్ అంటే కన్నీళ్లు..: కేటీఆర్

ఫోన్‌ ట్యాపింగ్‌ల వల్ల బీఆర్ఎస్ నేతలే రాజకీయ లబ్ధి పొందారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. తుక్కుగూడ రాజీవ్ గాంధీ సభా ప్రాంగణం నుంచి ‘తెలంగాణ జనజాతర’ సభా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఏఐసీసీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, ప్రియాంక గాంధీ ఈ సభలో పాల్గొంటారని చెప్పారు. ఈ సభలో కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదల చేస్తారని అన్నారు.

జూన్ 6వ తేదీన రాహుల్ ప్రధానమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారనడానికి ఈ సభ సాక్ష్యంగా నిలుస్తుందన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇవ్వని ఎన్నో హామీలను తెలంగాణలో అమలు చేస్తున్నామని అన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలకు ఇళ్లు ఇచ్చే కార్యక్రమం భద్రాచలంలో ప్రారంభించామన్నారు. తెలంగాణ పరిస్థితిపై శ్వేత పత్రం ద్వారా రాష్ట్ర వివరాలు వెల్లడించామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌తో కేసీఆర్ లక్ష కోట్లు అవినీతి చేశారని మండిపడ్డారు. సీఎంఆర్‌ఎఫ్‌లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని చెప్పారు.

Balaram Naik: ఎన్నికల కోడ్ అయిపోగానే ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ చేస్తాం


నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వచ్చింది.. కరువు వచ్చింది అంటున్నారని వర్షాలు పడనిది కేసీఆర్ హయాంలోనేనని అన్నారు. ఈ సారి 56% వర్షపాతం తక్కువగా నమోదైందన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో తక్కువ వర్ష పాతం నమోదైందని మీ అధికార పత్రికనే వార్తలు రాసిందని గుర్తుచేశారు.

తెలంగాణలో 16% రిజర్వాయర్లలో నీళ్లు అడుగంటాయన్నారు. గత ప్రభుత్వం ఉన్నప్పుడే అధికారులు తాగు, సాగు నీటి కరువు రాబోతుందని నివేదికలు ఇచ్చారని చెప్పారు. రూ. 45 వేల కోట్లు ఖర్చుచేసి కట్టిన మిషన్ భగీరథ ఇప్పుడు ఎందుకు గ్రామాలకి నీళ్లు ఇవ్వలేకపోతుందని ప్రశ్నించారు. కాళేశ్వరంలో లోపం వల్లే గోదావరి నీళ్లు కిందకు వదాలాల్సి వచ్చిందని చెప్పారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో ఎండిన పంటలకు నష్ట పరిహారం ఇవ్వని ఆయన ఇప్పుడెందుకు రైతులపై కపట ప్రేమ చూపుతున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి నిలదీశారు.

Kavitha: కవిత అడిగిన పుస్తకాల జాబితాను చూసి లాయర్లు, బీజేపీ నేతల ఆశ్చర్యం..


ఫోన్ ట్యాపింగ్‌పై కేంద్రం విచారణ చేయాలి: మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు

ఫోన్ ట్యాపింగ్ అంశంలో విచారణ చేయడానికి కేంద్రానికి అన్ని హక్కులు ఉన్నాయని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. కేంద్రంలో బీజేపీ ఎందుకు దీనిపై యాక్షన్ తీసుకోట్లేదని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్‌లో మోదీ ప్రభుత్వం బీఆర్ఎస్ నేతలకు సహకారం చేసేలా ఉందన్నారు. తమ మంత్రుల ప్రమేయం లేకుండా నిష్పక్షపాతంగా ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతుందన్నారు.

ఫోన్ ట్యాపింగ్ అంశంలో కేంద్రం ఎందుకు విచారణ చేయట్లేదని ప్రశ్నించారు. ఇప్పుడున్న నీటి కరువు బీఆర్ఎస్ హయాంలోనిదేనని త్రీ మెన్ కమిటీ ముందే చెప్పిందని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

TG Politics: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది వారే.. హరీశ్‌రావు హాట్ కామెంట్స్

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Apr 03 , 2024 | 11:01 PM

Advertising
Advertising