Ponguleti Srinivas Reddy: వచ్చే ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 04:35 PM
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి చరమగీతం పాడాలని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో (2024 Elections) బీజేపీకి (BJP) చరమగీతం పాడాలని కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం జిల్లాలోని వైరా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పార్లమెంటరీ సన్నాహక సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కష్టపడాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కులాలను, మతాలను రెచ్చగొట్టి.. రామ మందిరం పేరుతో రెండుసార్లు అధికారం చేపట్టిందని మండిపడ్డారు. అలాంటి బీజేపీని గద్దె దించాల్సిందేనని ఉద్ఘాటించారు.
IPL 2024: రాజస్థాన్ చేతిలో ఓడిన పంజాబ్.. ప్రీతి జింటా రియాక్షన్ చుశారా?
తెలంగాణ రాష్ట్రంలో తమ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాల్లో ఇప్పటికే ఐదింటిని తమ ప్రభుత్వం అమలు చేసిందని పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఈ పథకాలపై నేతలు విస్తృత ప్రచారం చేయాలని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిందన్నారు. నేతలపై ఫోన్ టాపింగ్ (Phone Tapping) సైతం పెట్టి ఇబ్బందులకు గురి చేసినా.. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందన్నారు. ఫోన్ టాపింగ్ చేసిన నేతలపై రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తప్పకుండా ఉంటాయని చెప్పారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారని, నీటిని స్టోరేజీ చేయటంలో విఫలమయ్యారని ఆరోపించారు. వేసవి కాలంలో నీటి సమస్యను తెరమీదకు తెచ్చి.. ప్రజల వద్దకు వచ్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. అయితే.. ఇప్పుడు వారి మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
Delhi Capitals: ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఊహించని షాక్.. ఆ స్టార్ ప్లేయర్ యూ-టర్న్?
గత ప్రభుత్వంలో అధికారం చేపట్టిన మంత్రులు సైతం భూ కబ్జాలకు పాల్పడ్డారని, వారికి తగిన శాస్తి చూపిస్తామని హెచ్చరించారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని పార్లమెంటు స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని నమ్మకం వెలిబుచ్చారు. కాగా.. ఈ సమావేశంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పువ్వాళ్ళ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి