ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

TG Politics: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మునిగిపోవడం ఖాయం: రఘునందన్ రావు

ABN, Publish Date - Apr 11 , 2024 | 09:34 PM

పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) పూర్తిగా మునిగిపోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్‌లో బీజేపీ మెదక్ పార్లమెంటు నియోజక వర్గం బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు.

మెదక్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ (BRS) పూర్తిగా మునిగిపోవడం ఖాయమని మెదక్ బీజేపీ పార్లమెంటు అభ్యర్థి రఘునందన్ రావు (Raghunandan Rao) అన్నారు. గురువారం నాడు మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్‌లో బీజేపీ మెదక్ పార్లమెంటు నియోజక వర్గ పోలింగ్ బూత్ అధ్యక్షుల సమ్మేళనం నిర్వహించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఈటల రాజేందర్, ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు, సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రఘునందన్‌రావు మాట్లాడుతూ... బీఆర్ఎస్ అనేది టైటానిక్ పడవ లాంటిదని.. మునిగిపోయే నావ అని విమర్శించారు. మెదక్ పార్లమెంటు నుంచి జై తెలంగాణ అన్నోళ్లు బీఆర్ఎస్‌‌కు అభ్యర్థిగా దొరకలేదా అని ప్రశ్నించారు.


Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?

జనంతోని గెలువలేనోళ్లు సూటీకేసుల పైసలు ఉన్న వెంకట్రామిరెడ్డి రెడ్డికి టికెట్ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ డబ్బులు పంచితే తరిమి తరిమి కొట్టాలని వార్నింగ్ ఇచ్చారు. సిద్దిపేట నుంచి హరీశ్‌ను బీట్ చేసే ఓట్లు బీజేపీకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. రఘునందన్‌కు ఒక్క ఓటు ఎక్కువ వచ్చినా సిద్దిపేట నుంచి హరీశ్‌ను కరీంనగర్‌కు పంపిస్తానని సవాల్ విసిరారు.


మాజీ సీఎం కేసీఆర్ కాళ్లు మొక్కి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా వెంకట్రామిరెడ్డి ఎమ్మెల్సీ ఎలా అయ్యారని నిలదీశారు. వరి వేస్తే ఊరి అన్న వెంకట్రామిరెడ్డి మెదక్‌కు వచ్చి రైతులను ఎలా ఓట్లు అడుగుతాడని ప్రశ్నించారు. సీఎం అయి ఏం చేయొచ్చో ఫోన్ ట్యాపింగ్ ద్వారా కేసీఆర్ చెప్పారన్నారు. నాలుగు పార్టీలు మారిన వ్యక్తికి కాంగ్రెస్ ఎంపీ ఎన్నికల్లో టికెట్ ఎలా ఇచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ ఎప్పుడు జైలుకు పోతాడో తెలియదని ఎద్దేవా చేశారు. మెదక్‌లో బీజేపీ గెలుపు ఖాయమని రఘునందన్ రావు ఆశాభావం వ్యక్తం చేశారు.


KTR: పూలే ఎంచుకున్న మార్గం అందరికీ ఆచరణీయం..

తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోంది: పాల్వాయి హరీశ్

ఆదిలాబాద్ పార్లమెంట్‌ను రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు (Palvai Harish Babu) ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో బీజేపీ గాలి వీస్తోందన్నారు. తెలంగాణ నుంచి 12 ఎంపీ సీట్లకు తక్కువ కాకుండా బీజేపీ అభ్యర్థులను పార్లమెంట్‌కు పంపిస్తామని తెలిపారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సగం సీట్లలో కూడా పోటీచేయడం లేదని ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు ఎద్దేవా చేశారు.


గోల్‌మాల్ చేసి రేవంత్ సీఎం అయ్యారు: ఈటల రాజేందర్

గోల్‌మాల్ చేసి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవీ ఎగిరేసుకుపోయారని జాతీయ కార్యవర్గ సభ్యుడు, మల్కాజిగిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటల రాజేందర్ (Etela Rajender) అన్నారు. దేశమంతా ‘అప్ కీ బార్.. చార్ సౌ బార్’ అని అంటుందన్నారు. రేవంత్ రెడ్డి , కేసీఆర్ లాగా మోదీ హామీలు ఇవ్వాలేదన్నారు. సనాతన పాలన చూసి ఓటేయాలని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీకి 330 ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశారు.


మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తానని సీఎం రేవంత్ చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. కేసీఆర్ ఎకరానికి రూ 10 వేలు ఇచ్చారని.. తానూ రూ .15 వేలు ఇస్తానని రేవంత్ చెప్పి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. రైతులకు రూ.500 బోనస్ ఇస్తానని ఇవ్వకుండా ఎగ్గొట్టారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ హామీలపై వేటాడి వెంటపడుతామని హెచ్చరించారు. ప్రాజెక్ట్ లల్లో నీళ్లు ఉన్నప్పటికీ పాలనలో సమన్వయం లేక పంటలు ఎండుతున్నాయని అన్నారు.


CM Revanth: ధాన్యం కొనుగోళ్లల్లో నిర్లక్ష్యం వహించొద్దు.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

మల్కాజిగిరిలో పైసలు ఇచ్చి కాంగ్రెస్‌లో చేర్పించు కుంటున్నారని విమర్శించారు. అధికారం ఉందని ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్‌లోకి వస్తున్నారన్నారు. మోదీ నాయకత్వంలో దేశంలో ప్రశాంతత వచ్చిందన్నారు. ముస్లిం మహిళలకు త్రిబుల్ తలాక్‌ను మోదీ ప్రభుత్వం రద్దు చేసిందని అన్నారు. అయోధ్యలో ఆలయాన్ని నిర్మించి దేశం సల్లగా ఉండాలని మోదీ కోరుకున్నారని అన్నారు. మోదీకి సరితూగే నాయకుడు ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌గాంధీ అవుతారా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ , కాంగ్రెస్‌కి ఓటేయొద్దని.. బీజేపీని గెలిపించాలని ఈటల రాజేందర్ కోరారు.


ఇవి కూడా చదవండి

Padi Koushik Reddy: పార్టీ మారిన ఎమ్మెల్యేలను వదిలి పెట్టం

మరిన్ని తెలంగాణ వార్తల కోసం...

Updated Date - Apr 11 , 2024 | 10:17 PM

Advertising
Advertising