Flood Relief: తెలుగు ప్రజలను కేంద్రం ఆదుకోవాలి: రాహుల్
ABN, Publish Date - Sep 03 , 2024 | 05:36 AM
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో డిమాండ్ చేశారు.
న్యూఢిల్లీ, సెప్టెంబరు 2(ఆంధ్రజ్యోతి): భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎక్స్‌లో డిమాండ్ చేశారు. బాధితులకు పునరావాస ప్యాకేజీలను త్వరగా అందించాలన్నారు. తెలంగాణలో పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకొచ్చేందుకు, సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అక్కడి రాష్ట్ర ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందన్నారు. ఏపీలో వరద బాధితులను ఆదుకునేందుకు పునరావాస ప్యాకేజీని అందించాలని అక్కడి సర్కారును కోరారు.
Updated Date - Sep 03 , 2024 | 05:36 AM