నాబార్డు నిధులతో గోదాం, రైస్‌మిల్లు నిర్మాణం
ABN , Publish Date - Feb 05 , 2024 | 11:51 PM
రైతుల అభ్యున్నతికి నాబార్డు నిధులతో గోదాం, రైస్‌మిల్లును నిర్మించామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు.

కులకచర్ల, ఫిబ్రవరి 5: రైతుల అభ్యున్నతికి నాబార్డు నిధులతో గోదాం, రైస్‌మిల్లును నిర్మించామని తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిరుమలపూర్ గ్రామ పరిధిలో నాబార్డు నిధులు రూ.కోటీ 60లక్షలతో నిర్మించిన గోదాంను ఇప్పటికే ప్రారంభించగా సోమవారం రైస్‌మిల్లును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ ప్రాంత రైతుల అభ్యున్నతికి తాను డీసీసీబీ చైర్మన్‌గా నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. రైతులకు ఎల్లవేళలా అండగా ఉంటామని తెలిపారు. తాను ఎక్కడున్నా ఈప్రాంత ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం మండలంలోని బండవెల్కిచర్ల గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు లక్ష్మారెడ్డి మృతిచెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు.
తిరుమలపూర్ గ్రామ సొసైటీ డైరెక్టర్‌గా మొగులయ్య
కులకచర్ల: మండలంలోని తిరుమలపూర్ గ్రామ సోసైటి డైరెక్టర్‌గా అదే గ్రామానికి చెందిన కనకం మొగులయ్య సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాండూర్ ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి సమక్షంలో 10 మంది డైరెక్టర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిరుమలపూర్ సొసైటీ డైరెక్టర్‌గా గతంలో ఏకగ్రీవంగా ఎన్నికైన మనోహర్‌రెడ్డి డీసీసీబీ చైర్మెన్‌గా ఎన్నికయ్యారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాండూర్ నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో డీసీసీబీ, డైరెక్టర్ పదవులు ఖాళీ అయ్యాయి. సొసైటీకి చెందిన 10మంది సభ్యులు ఏకగ్రీవంగా అదేగ్రామానికి చెందిన కనకం మొగులయ్యను డైరెక్టర్‌గా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాగరాజు, విజయ్‌కుమార్ పాల్గొనకపోవడం గమన్హారం. త్వరలోనే సొసైటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది.