మట్టి తరలింపు వాహనాల సీజ్
ABN , Publish Date - May 25 , 2024 | 11:37 PM
ఎక్లా్‌సఖాన్‌పేట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్, ఎక్స్‌కవేటర్‌ను శనివారం స్వాధీనం చేసుకున్నట్టు ఏఎ్‌సఐ నరసింహులు శనివారం తెలిపారు.

కేశంపేట, మే 25: ఎక్లా్‌సఖాన్‌పేట నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్, ఎక్స్‌కవేటర్‌ను శనివారం స్వాధీనం చేసుకున్నట్టు ఏఎ్‌సఐ నరసింహులు శనివారం తెలిపారు. గ్రామస్తుల సమాచారంతో ఎక్లా్‌సఖాన్‌పేటలో తనిఖీ చేయగా చెరువులో నుంచి మట్టిని తరలించేందుకు వాడుతున్న టిప్పర్, ఎక్స్‌కవేటర్‌ను స్వాధీనం చేసుకుని స్టేషన్‌కు తరలించినట్లు తెలిపారు. కానిస్టేబుల్ భీమ్‌రాజు ఫిర్యాదు మేరకు టిప్పర్ డ్రైవర్ యాదగిరి, ఎక్స్‌కవేటర్ ఆపరేటర్ రవి, వాహనాల యజమానులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎ్‌సఐ వివరించారు.