Revanth Reddy: ఢిల్లీకి రేవంత్.. ఈసారైనా క్లారిటీ వస్తుందా?
ABN, Publish Date - Apr 11 , 2024 | 01:06 PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం(ఆప్ కీ అదాలత్ ) టీవీ షో కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు. నేడు తెలంగాణలోని మూడు లోక్ సభ పెండింగ్ స్థానాలపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది.
ఢిల్లీ: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఢిల్లీ చేరుకున్నారు. సాయంత్రం(ఆప్ కీ అదాలత్ ) టీవీ షో కార్యక్రమంలో రేవంత్ పాల్గొననున్నారు. నేడు తెలంగాణ (Telangana)లోని మూడు లోక్‌సభ (Loksabha) పెండింగ్ స్థానాలపై అధిష్టానం పెద్దలతో చర్చించే అవకాశం ఉంది. కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ లోక్‌సభ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయి. మరి ఈసారైనా వీటిపై క్లారిటీ వస్తుందో లేదో చూడాలి. షెడ్యూల్ వచ్చి చాలా రోజులు అవుతున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రం పెండింగ్ స్థానాలపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోవడం లేదు. ముఖ్యంగా ఈ మూడు స్థానాల్లో ఖమ్మం, కరీంనగర్ స్థానాలు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా మారాయి.
వైమానిక దాడులు చేశారంటూ ఫోటోలతో మావో లేఖ
హైదరాబాద్ విషయంలో అయితే పార్టీ అధిష్టానం పెద్దగా ఆలోచించాల్సిన అవసరమైతే లేదు. మిగిలిన రెండు నియోజకవర్గాల్లో ముఖ్యంగా సామాజిక సమీకరణాలతో పాటు పార్టీ కీలక నేతలు తమకు కావాలంటే తమకు కావాలంటూ పట్టుబట్టడంతో రెండూ సమస్యగా తయారయ్యాయి. కరీంనగర్ బీసీకి కావాలంటూ అక్కడి నేతలు పట్టుబడుతుండగా.. ఖమ్మం టికెట్‌ను కమ్మ సామాజిక వర్గానికి కేటాయించాలంటూ కొందరు.. రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించాలని కొందరు.. భట్టి విక్రమార్క సతీమణికి కేటాయించాలని కొందరు.. అందరినీ కాదని మండవ వెంకటేశ్వరరావు సైతం సీన్‌లోకి వచ్చారు. అయితే ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే బీజేపీ, బీఆర్ఎస్‌లు అభ్యర్థులను ప్రకటించేశాయి. వారు ఇప్పుడు ప్రచారం కూడా నిర్వహించుకుంటున్నారు. ఈసారైనా ఈ మూడు స్థానాలపై క్లారిటీ వస్తుందో రాదో చూడాలి.
Kothakota Srinivas: ఫోన్ ట్యాపింగ్‌పై హైదరాబాద్ సీపీ తొలి రియాక్షన్...
మరిన్ని తెలంగాణ వార్తల కోసం...
Updated Date - Apr 11 , 2024 | 01:06 PM