ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Siddipet Steel Bank: ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంకుకు గుర్తింపు..

ABN, Publish Date - Jul 23 , 2024 | 04:03 AM

సిద్దిపేటను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్‌ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది.

  • ప్లాస్టిక్‌ రహిత ఆలోచన గొప్పదని ప్రశంస

  • ఇన్నోవేషన్‌ హబ్‌ల ఏర్పాటుతో అభివృద్ధిలో..

  • తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోందని కితాబు

సిద్దిపేట టౌన్‌, జూలై 22 : సిద్దిపేటను ప్లాస్టిక్‌ రహితంగా మార్చాలన్న ఉద్దేశంతో అమలు చేస్తున్న సిద్దిపేట స్టీల్‌ బ్యాంకు కార్యక్రమానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. సోమవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే ఈ కార్యక్రమాన్ని ప్రశంసించింది. స్టీల్‌ బ్యాంకు ఆలోచనతో ప్లాస్టిక్‌ ఉపయోగం వల్ల వచ్చే నష్టాల గురించి ప్రజలు తెలుసుకున్నారని సర్వే పేర్కొంది. నెలకు దాదాపు 28 క్వింటాళ్ల ప్లాస్టిక్‌ వినియోగం కాకుండా నివారించగలిగారని తెలిపింది. సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ స్ఫూర్తిని దేశమంతా అమలు చేస్తామని పేర్కొంది. కాగా, గ్లోబల్‌ కెపాసిటీ సెంటర్లను వివిధ రంగాల్లో విస్తరించి ఇన్నోవేషన్‌ హబ్‌లను ఏర్పాటు చేయడంలో తెలంగాణ పాత్రను కూడా సర్వే ప్రశంసించింది. భారత ఫార్మాసూటికల్‌ ఉత్పత్తిలో 30 శాతం మేర తెలంగాణలోనే జరుగుతోందని, అక్కడ వెయ్యి లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలు.. వినూత్నమైన, జనరిక్‌ మందుల తయారీ కోసం 200 ఎఫ్‌డీఏ ఆమోదించిన కేంద్రాలు ఉన్నాయని తెలిపింది.


హరీశ్‌రావు హర్షం..

2020లో ఫిబ్రవరిలో మాజీ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటలో స్టీల్‌ బ్యాంకులకు శ్రీకారం చుట్టారు. ఫంక్షన్లలో ప్లాస్టిక్‌ గ్లాస్‌లు, ప్లేట్లు వంటి వస్తువులు వినియోగించకుండా మునిసిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల్లో స్టీల్‌ బ్యాంక్‌లను ఏర్పాటు చేశారు. దీంతో ఫంక్షన్లలో ప్లాస్టిక్‌ వినియోగం తగ్గింది. కాగా, ఆర్థిక సర్వేలో సిద్దిపేట స్టీల్‌ బ్యాంక్‌ను ప్రశంసించడంపై సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో ట్వీట్‌ చేశారు. సిద్దిపేటను మరోసారి జాతీయ స్థాయిలో నిలిపిన ప్రజలు, అధికారులకు అభినందనలు తెలిపారు

Updated Date - Jul 23 , 2024 | 04:03 AM

Advertising
Advertising
<