Share News

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

ABN , Publish Date - Dec 24 , 2024 | 04:38 AM

దక్షిణ మధ్య రైల్వే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్‌ ఇండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది.

దక్షిణ మధ్య రైల్వేకు ఆలిండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): దక్షిణ మధ్య రైల్వే సివిల్‌ ఇంజనీరింగ్‌ విభాగానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. ఈ విభాగం ప్రదర్శించిన అత్యుత్తమ పనితీరుకు గుర్తింపుగా ఆల్‌ ఇండియా పెర్ఫార్మెన్స్‌ ఎఫిషియెన్సీ అవార్డు వరించింది. రైల్వే వారోత్సవాల సందర్భంగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఈ అవార్డు షీల్డ్‌ను దక్షిణమధ్యరైల్వే జీఎం అరుణ్‌కుమార్‌ జైన్‌కు అందజేశారు. అలాగే జోన్‌ పరిధిలోని వివిధ డివిజన్లలో అత్యుత్తమ సేవలందించిన అధికారులు జవ్వాది వెంకట అనూష, వావిలపల్లి రాంబాబు, సుమిత్‌ శర్మ, ఆంథోనీ దొరైరాజ్‌, ఆదినారాయణ, కామారపు వినోద్‌లకు అతివిశిష్ట సేవా పురస్కారాలను అందజేశారు.

Updated Date - Dec 24 , 2024 | 04:38 AM