Share News

Toll Plaza: నేటి అర్ధరాత్రి నుంచి ‘టోల్‌’ బాదుడు!

ABN , Publish Date - Jun 02 , 2024 | 02:56 AM

టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్‌ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది.

Toll Plaza: నేటి అర్ధరాత్రి నుంచి ‘టోల్‌’ బాదుడు!

  • టోల్‌ యూజర్‌ చార్జీ రూ.3 పెంపు

కేతేపల్లి, జూన్‌ 1: టోల్‌ ప్లాజాల వద్ద వాహనదారుల నుంచి వసూలు చేసే టోల్‌ ఫీజు ధరల పెంపునకు రంగం సిద్ధమైంది. ప్రతీ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి టోల్‌ ధరలు 5 శాతం పెంచుతుంటారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ధరల పెంపు ఈ సారి తాత్కాలికంగా నిలిచిపోయింది. దేశ వ్యాప్తంగా ఎన్నికలు పూర్తవ్వడంతో ఈ నెల మూడో తేదీ నుంచి(ఆదివారం అర్ధరాత్రి) నుంచి పెంచిన టోల్‌ ధరలు అమలులోకి రానున్నాయి. రాష్ట్రంలోని 65వ నెంబరు జాతీయ రహదారిపై తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో జీఎంఆర్‌ సంస్థ ఏర్పాటు చేసిన టోల్‌ప్లాజాల్లో టోల్‌ చార్జీలను ఆదివారం అర్ధరాత్రి తర్వాత నుంచి పెంచుతున్నారు. హైదరాబాద్‌- విజయవాడ మార్గంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో చౌటుప్పల్‌ మండలం పంతంగి, కేతేపల్లి మండలంలోని కొర్లపహాడ్‌, ఏపీలోని చిల్లకల్లు వద్ద టోల్‌ప్లాజాలను జీఎంఆర్‌ ఏర్పాటు చేసింది.


టోల్‌చార్జీల పెంపును జూన్‌ 3(సోమవారం) ఉదయం నుంచి అమలు చేస్తున్నామని కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజాలో ఎన్‌హెచ్‌ఏఐ ప్రతినిధి సతీష్‌ తెలిపారు. వాహనాల సామర్థ్యం ఆధారంగా ఒక్కో వాహనానికి ఒకవైపు, ఇరువైపులా ప్రయాణానికి కలిపి కనిష్ఠంగా రూ.5 నుంచి గరిష్ఠంగా రూ.40 మేర చార్జీలు పెరిగాయి. అలాగే. టోల్‌ప్లాజాకు 20 కిలోమీటర్ల పరిధిలోని గ్రామాలకు చెందిన స్థానిక వాహనాల నెలవారీ పాసు ధరను రూ.330 నుంచి రూ.340కి పెంచారు. ఇక,పెరిగిన టోల్‌ ఫీజుల భారాన్ని ఆర్టీసీ ప్రయాణికులపైనే వేస్తోంది. ఆర్టీసీకి చెందిన వివిధ సర్వీసుల్లో ప్రయాణించే ఒక్కో ప్రయాణికుడిపై రూ.3 అదనపు భారం పడనుంది. ఈ మేరకు ఆర్టీసీ యాజమాన్యం సవరించిన చార్జీలతో సర్క్యులర్‌ను శుక్రవారమే జారీ చేసింది.


పంతంగి టోల్‌ప్లాజా వద్ద జూన్‌ 2 నుంచి పెరగనున్న టోల్‌ఫీజులు

వాహనం పేరు సింగల్‌ జర్నీ రిటర్న్‌ జర్నీ నెలవారీ

(పాత రేటు- కొత్త రేటు రూ.ల్లో)

కారు, జీపు, వ్యాన్‌ లేదా లైట్‌ మోటర్‌ వాహనం 90-95 135-145 2965-3200

లైట్‌ కమర్షియల్‌, లైట్‌ గూడ్స్‌ వాహనాలు 140-150 210- 230 4685- 5055

బస్‌ లేదా ట్రక్‌ 290- 315 435- 470 9685-10455

హెవీ కన్‌స్ట్రక్షన్‌, ఎర్త్‌ మూవింగ్‌ వాహనాలు 450-485 675-725 14970-16155

పెద్ద వాహనాలు 560-605 845-910 18740-20225

కొర్లపహాడ్‌ టోల్‌ప్లాజా వద్ద

కారు, జీపు, వ్యాన్‌, లైట్‌ మోటార్‌ వాహనాలు 125-130 190-195 4225-4335

లైట్‌ వాణిజ్య, లైట్‌ వస్తువాహనాలు, మినీ బస్సు 190-195 300-310 6710-6880

బస్సు లేక ట్రక్కు, (రెండు యాక్సిల్స్‌) 415-430 625-640 13,910-14,265

భారీ నిర్మాణ,మల్టీయాక్సిల్‌ వాహనాలు 645 -665 970-995 21,570- 22,120

భారీ పరిమాణ వాహనాలు 805- 825 1210-1240 26,840-27,525

Updated Date - Jun 02 , 2024 | 02:57 AM