ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kaleshwaram: రేపు మేడిగడ్డకు సీఎ్‌సఎంఆర్‌ఎస్‌ బృందం

ABN, Publish Date - May 28 , 2024 | 04:24 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకుగాను భూ భౌతిక (జియో ఫిజికల్‌), భూ సాంకేతిక (జియో టెక్నికల్‌) పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం రానుంది.

  • కొనసాగుతున్న మరమ్మతు పనులు.. బ్లాక్‌-7లో గ్రౌటింగ్‌ కోసం బోర్‌వెల్‌తో హోల్స్‌..

  • పనులను పరిశీలించిన మరమ్మతుల కమిటీ

  • పది రోజుల్లో పూర్తికానున్న గేట్ల కత్తిరింపు

హైదరాబాద్‌/మహదేవపూర్‌ రూరల్‌/మహదేవపూర్‌, మే 27 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ ఏ విధంగా ఉందో గుర్తించేందుకుగాను భూ భౌతిక (జియో ఫిజికల్‌), భూ సాంకేతిక (జియో టెక్నికల్‌) పరీక్షలు చేయడానికి ఈ నెల 29వ తేదీన ఢిల్లీకి చెందిన కేంద్ర మృత్తిక, ఇతర భూపదార్థాల పరిశోధన కేంద్రం (సీఎ్‌సఎంఆర్‌ఎస్‌) నిపుణుల బృందం రానుంది. ఈ మేరకు రాష్ట్ర అధికారులకు ఆ సంస్థ సోమవారం సమాచారం ఇచ్చింది. ఇప్పటిదాకా మట్టి నమూనాలు పంపిస్తే పరీక్షలు చేసి వివరాలు ఇస్తామని సంస్థ చెబుతూ వచ్చింది. అయితే అధికారులు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేయడంతో నిపుణులను పంపుతోంది. మరోవైపు బ్యారేజీ ఏడో బ్లాకులోని గేటు నెంబర్‌ 20కి ఎదురుగా ఏర్పడిన అగాధాన్ని గ్రౌటింగ్‌ పద్ధతిలో పూడ్చేందుకు బోర్‌వెల్‌ ద్వారా హోల్స్‌ వేస్తున్నారు. ఈ పనులను సోమవారం బ్యారేజీ మరమ్మతుల (పునరుద్ధరణ, రక్షణ) కమిటీ చైర్మన్‌, రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ (జనరల్‌) అనిల్‌కుమార్‌ పరిశీలించారు.


సెంట్రల్‌ డిజైన్‌ ఆర్గనైజేషన్‌ చీఫ్‌ ఇంజనీర్‌ (సీడీవోసీఈ) మోహన్‌కుమార్‌, కమిటీ సభ్యులతో కలిసి జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్‌ మండలంలోని మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను అనిల్‌కుమార్‌ సందర్శించారు. మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7లో జరుగుతున్న షీట్‌ఫైల్‌ ఏర్పాటు, గేట్ల తొలగింపు పనులను కూడా వీరు పరిశీలించారు. గ్రౌటింగ్‌ పనులను త్వరితగతిన ప్రారంభించాలని సూచించారు. జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) సూచనలను పాటిస్తూ తాత్కాలిక మరమ్మతుల్లో వేగం పెంచాలని, వానాకాలం ప్రారంభమయ్యే నాటికి గేట్లన్నీ తెరిచి ఉండేలా చూడాలని అన్నారు.


అనంతరం అన్నారం బ్యారేజీని పరిశీలించారు. వానాకాలంలో బ్యారేజీలో నీటిని నిల్వ చేసేందుకు సాధ్యాసాధ్యాలను పరిశీలించి అందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. బ్యారేజీకి దిగువ ప్రవాహం వైపు ఉన్న లీకేజీలను, ఎగువ ప్రవాహం వైపు గేట్లు, ప్లాట్‌ఫామ్‌పై పేరుకుపోయిన ఇసుక తొలగింపు పనులను పరిశీలించారు. దీనికి ముందు కన్నెపల్లి పంప్‌హౌ్‌సను సందర్శించారు. ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటిని నిల్వ చేసే అవకాశం ఉంటే.. దానిని బట్టి పంప్‌హౌ్‌సను సిద్ధంగా ఉంచాలన్నారు. పంప్‌హౌ్‌సలో మోటార్లు, డెలివరీ చానల్‌తో పాటు, అన్నారం బ్యారేజీని కలిపే గ్రావిటీ కెనాల్‌ను పరిశీలించారు.


గ్రౌటింగ్‌ పనులకు సర్వం సిద్ధం..

మేడిగడ్డ బ్యారేజీ బ్లాక్‌-7 కింద ఏర్పడిన అగాధాన్ని పూడ్చేందుకు చేపట్టనున్న గ్రౌటింగ్‌ పనులకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం సాయంత్రమే ఇసుక గ్రౌటింగ్‌ పనులు ప్రారంభించాలని అనుకున్నప్పటీకీ.. ఇందుకు సంబంధించిన హోల్స్‌ పూర్తయ్యేసరికి చీకటి కావడంతో వీలు కాలేదని సమాచారం. 20వ, 21వ పిల్లర్ల మధ్య ఉన్న గేట్‌ కటింగ్‌తో పాటు బ్యారేజీకి దిగువన షీట్‌ఫైల్స్‌ అమరిక పనులు మాత్రం కొనసాగుతున్నాయి. కాగా, గేట్ల కత్తిరింపు ప్రక్రియ పది రోజుల్లో పూర్తవుతుందని అంచనా వేస్తున్నారు.

Updated Date - May 28 , 2024 | 04:24 AM

Advertising
Advertising