ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

irrigation projects: ఏడాదిలో పెండింగ్‌ ప్రాజెక్టుల పూర్తి!

ABN, Publish Date - Jul 18 , 2024 | 03:09 AM

ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

  • 2025 డిసెంబరు నాటికి పూర్తి చేయడమే లక్ష్యం

  • వచ్చే బడ్జెట్‌లో11 వేల కోట్లు అడుగుతాం

  • ఇచ్చంపల్లి ప్రాజెక్టుపై చర్చిస్తాం: ఉత్తమ్‌

హైదరాబాద్‌, జూలై 17 (ఆంధ్రజ్యోతి): ఈ ఆర్థిక సంవత్సరంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనులకు రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిందిగా ఆర్థికశాఖకు ప్రతిపాదనలు అందజేస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మధ్యంతర బడ్జెట్‌లో రూ.28 వేల కోట్లను నీటిపారుదల శాఖకు కేటాయించగా.. అందులో రూ.18 వేల కోట్లు గత ప్రభుత్వం ప్రాజెక్టుల కోసం చేసిన అప్పులకే చెల్లించాల్సి వస్తోందన్నారు. మిగిలిన నిధుల్లో రూ.2 వేల కోట్లు వేతనాలు/ఇతర ఖర్చులకు అవుతాయని, రూ.8 వేల కోట్లు మాత్ర మే పనులకు కేటాయించే వీలుంటుందని తెలిపారు.


ఇవి కాకుండా.. గత ప్రభుత్వం రూ.9 వేల కోట్ల దాకా పెండింగ్‌ బిల్లులు వదిలేసిపోయిందని పేర్కొన్నారు. దాంతో ప్రాజెక్టుల పనులు జరగాలంటేమరో రూ.11 వేల కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. బుధవారం ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని ప్రాజెక్టులపై అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది 6.50 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సాగులోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఆ దిశగా పనులు ముమ్మరం చేస్తున్నామని, ఈ ఏడాది చివరికల్లా పూర్తయ్యే ప్రాజెక్టులను ఏ-కేటగిరీలో చేర్చామని వెల్లడించారు.


తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇచ్చంపల్లి వద్ద రిజర్వాయర్‌ నిర్మించి ఆ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌ ద్వారా 195 టీఎంసీలను కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద తరలించడానికి వీలు కల్పిస్తామన్న ఎన్‌డ బ్ల్యూడీఏ ప్రతిపాదనపై అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్‌ చెప్పారు. సమ్మక్కసాగర్‌ (తుపాకులగూడెం) బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) తెప్పించుకోవడానికి వీలుగా సంప్రదింపుల ప్రక్రియను ముమ్మరం చేశామన్నారు. ఇక నీటిపారుదల శాఖలో పదోన్నతుల ప్రక్రియను న్యాయ నిపుణుల సలహా తీసుకున్నాక చేపడతామని తెలిపారు.


ఆరునూరైనా పదోన్నతుల ప్రక్రియను ముందుకు తీసుకెళతామమని, వివాదాలేమున్నా సంప్రదింపులతో పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం పునర్‌వ్యవస్థీకరణతో నీటిపారుదల శాఖను కుప్పకూల్చిందని, దీనిని సమీక్షిస్తామని అన్నారు. ఇక ఈ నెలాఖరున సదర్‌మట్‌ ప్రాజెక్టును సీఎం ఎ.రేవంత్‌రెడ్డి ప్రారంభిస్తారని, ఆగస్టు 15న సీతారామ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రాజీవ్‌ కెనాల్‌ను ప్రారంభిస్తారనని ఉత్తమ్‌ చెప్పారు. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సదర్‌మట్‌లో మిగిలిన పనులన్నీ సత్వరమే పూర్తిచేయాలన్నారు.


20న ఢిల్లీకి మంత్రి ఉత్తమ్‌

కాళేశ్వరం ప్రాజెక్టులోని బ్యారేజీలపై జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎ్‌సఏ) అధికారులతో సమావేశం కావడానికి నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి 20న ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక అమలు, పూర్తి స్థాయి నివేదికపై సంస్థ చైౖర్మన్‌తో సమావేశం కానున్నారు. మరోవైపు ఎన్‌డీఎ్‌సఏ మధ్యంతర నివేదిక అమలు స్థితిగతులపై మంత్రి అధికారులతో సమీక్ష నిర్వహి ంచారు. ఈ సందర్భంగా ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ అనిల్‌జైన్‌తో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. బ్యారేజీలపై తుది నివేదికను సత్వరమే అందించాలని కోరారు.

Updated Date - Jul 18 , 2024 | 03:09 AM

Advertising
Advertising
<