Telangana division act: తెలంగాణకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం!

ABN, Publish Date - Jul 26 , 2024 | 05:29 AM

విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Telangana division act: తెలంగాణకు బడ్జెట్‌లో తీవ్ర అన్యాయం!

  • ప్రధాని మోదీకి తెలంగాణకాంగ్రెస్‌ ఎంపీల లేఖ

న్యూఢిల్లీ, జూలై 25 (ఆంధ్రజ్యోతి): విభజన చట్టంలో తెలంగాణకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ సీఎం రేవంత్‌, డిప్యూటీ సీఎం భట్టి.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలిసి విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో తెలంగాణకు అన్యాయం జరిగిందంటూ 8మంది ఎంపీలు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు గురువారం లేఖ రాశారు. విభజన చట్టంలో రాష్ట్రానికి ఐఐఎం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, రైల్వేకోచ్‌ ఫ్యాక్టరీ, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, తొమ్మిది ఉమ్మడి జిల్లాలకు వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను కేటాయిస్తామని హామీలు ఇచ్చి నెరవేర్చలేదని గుర్తు చేశారు.


తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీలు మల్లు రవి, కడియం కావ్య, చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, రఘురామిరెడ్డి, బలరాంనాయక్‌, సురేష్‌ షెట్కార్‌ పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల నమ్మకాన్ని బీజేపీ ఎంపీలు వమ్ము చేశారని ఆరోపించారు. రాష్ట్రం నుంచిఇద్దరు కేంద్ర మంత్రులుగా ఉన్నప్పటికీ న్యాయం చేయలేదన్నారు. చిత్తశుద్ధి ఉంటే బీజేపీ ఎంపీలు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై పోరాటం చెయ్యాలని సూచించారు. సీఎం రేవంత్‌ సూచనల ప్రకారం తమ ఉద్యమ కార్యాచరణ ఉంటుందని తెలిపారు.

Updated Date - Jul 26 , 2024 | 05:29 AM

Advertising
Advertising
<