Share News

DSC Results 2024: ఒక్క క్లిక్‌తో డీఎస్సీ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా

ABN , Publish Date - Sep 30 , 2024 | 12:15 PM

ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results 2024) సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి.

DSC Results 2024: ఒక్క క్లిక్‌తో డీఎస్సీ ఫలితాలు.. చెక్ చేసుకోండిలా
DSC Results 2024

హైదరాబాద్: తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ నిర్వహించిన 'టీజీ డీఎస్సీ-2024' పరీక్ష ఫలితాలు (DSC Results 2024) సోమవారం (సెప్టెంబరు 30) విడుదలయ్యాయి. ఉదయం 11 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ డీఎస్సీ పరీక్ష ఫలితాలను విడుదల చేశారు. జనరల్‌ ర్యాంకింగ్‌ జాబితాను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. రాష్ట్రంలో 11 వేల 062 టీచర్‌ పోస్టుల భర్తీకి విద్యాశాఖ మార్చి 1న డీఎస్సీ నోటిఫికేషన్‌‌ను ప్రభుత్వం విడుదల చేసింది. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఫలితాల్లో కేవలం మార్కులు, ర్యాంక్ మాత్రమే ఉంటాయి. Merit Cum Roster ప్రకారం సెలెక్టెడ్ లిస్టును జిల్లాల వారీగా DEOలకు ఇస్తారని అధికారులు తెలిపారు. ధ్రువపత్రాల పరిశీలన అనంతరం.. సాధారణ ర్యాంకింగ్ జాబితా ఆధారంగా, రిజర్వేషన్ ప్రకారం 1:1 నిష్పత్తిలో జిల్లాల వారీగా అభ్యర్థుల మెరిట్ జాబితాను ప్రకటించే అవకాశం ఉంది.

ఫలితాల లింక్..

Telangana DSC Results 2024 Link: ఈ లింక్‌ను క్లిక్ చేసి ఫలితాలు చూసుకోవచ్చు

56 రోజుల తరువాత..

ఈ ఏడాది ఫిబ్రవరి 29న 11,062 టీచర్ ​పోస్టుల భర్తీకి ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్​ విడుదల చేసిన సంగతి తెలిసిందే. జూలై 18వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు డీఎస్సీ పరీక్షలను రేవంత్ సర్కార్ నిర్వహించింది. 2.45 లక్షల మంది అభ్యర్థులు డీఎస్సీ పరీక్షలు రాశారు.


తుది కీ పై అభ్యంతరాలు

పరీక్షలకు సంబంధించి వెబ్‌సైట్‌ నుంచి రెస్పాన్స్‌ షీట్‌లను తొలగించారు. ఇప్పటికే ప్రాథమిక కీతోపాటు తుది జాబితాను విడుదల చేశారు. తుది కీపై అభ్యర్థుల నుంచి కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా 12 ప్రశ్నలకు సంబంధించిన జవాబులపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. వీటిపై ఇప్పటికే నిపుణుల కమిటీ విద్యాశాఖకు నివేదిక సమర్పించినట్లు సమాచారం. ఈ నివేదిక ఆధారంగా ఈ అభ్యంతరాలను పరిష్కరించారు. డీఎస్సీ పరీక్షల్లో వచ్చిన మార్కులకు టెట్‌ మార్కుల వెయిటేజీని కలిపి జనరల్‌ ర్యాంకులను వెల్లడించారు.


అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ

స్వల్ప కాలంలో ఫలితాలను విడుదల చేసి ప్రభుత్వం సరికొత్త రికార్డు నెలకొల్పింది. అయితే జిల్లాలో ఉపాధ్యాయ పోస్టుల కోసం అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టులకు పోటీ తీవ్రంగా ఉన్న జిల్లాల్లో వికారాబాద్‌ మూడో స్థానంలో ఉంది. ఒక పోస్టుకు 50 నుంచి 100 మంది వరకు పోటీపడ్డారు. ఎస్జీటీ పోస్టుల విషయానికి వస్త్తే రాష్ట్రంలో ఎక్కువ పోటీ వికారాబాద్‌ జిల్లాలోనే నెలకొనడం గమనార్హం. 11,062 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు ఫిబ్రవరి 29న 'డీఎస్సీ-2024' నోటిఫికేషన్‌ విడుదల చేసింది ప్రభుత్వం. మార్చి 4 నుంచి జూన్ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు తీసుకున్నారు. ఈ నోటిఫికేషన్‌లో 6,508 ఎస్జీటీ పోస్టులు, 2,629 స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగాలు, 727 లాంగ్వేజ్ పండిట్ పోస్టులు, 182 పీఈటీ పోస్టులు, స్పెషల్‌ కేటగిరీలో 220 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు , 796 ఎస్జీటీలు భర్తీ చేస్తారు. జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించారు. ఈ ఉద్యోగాలకు మొత్తం 2,79,957 మంది దరఖాస్తు చేశారు. 2,45,263 మంది హాజరయ్యారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం

Updated Date - Sep 30 , 2024 | 12:53 PM