ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Telangana tourism: ఖమ్మం ఖిల్లాపై రూ.30 కోట్లతో రోప్‌ వే

ABN, Publish Date - Aug 13 , 2024 | 03:54 AM

పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

  • డిప్యూటీ సీఎం భట్టి.. తుమ్మల, జూపల్లి, పొంగులేటి

  • ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యాటక క్షేత్రాల పరిశీలన

ఖమ్మం/కొత్తగూడెం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పర్యాటక రంగంలో తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపడమే ఇందిరమ్మ ప్రభుత్వ లక్ష్యమని, అందు కోసం ఎన్ని నిధులైనా కేటాయిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావు, తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పర్యాటక ప్రాంతాల్లో సోమవారం వారు పర్యటించారు. ఖమ్మం ఖిల్లాపైకి ఎక్కి పురాతన కట్టడాలను తిలకించారు. అంతకుముందు నేలకొండపల్లి బౌద్ధస్థూపం, భక్తరామదాసు నివాసంతో పాటు ఉమ్మడి జిల్లాలో పలు పర్యాటక ప్రదేశాలను పరిశీలించారు.


భద్రాద్రి జిల్లా పాల్వంచలో ఉన్న కిన్నెరసాని జలాశయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా భట్టి సహా మంత్రులు మాట్లాడారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం ఖిల్లాతో పాటు పురాతన బౌద్ధస్థూపం, భక్తరామదాసు నివాసం, పాలేరు నుంచి భద్రాచలం వరకు ఎన్నో పర్యాటక ప్రదేశాలున్నాయని, వాటిని అభివృద్ధి చేస్తామన్నారు. ఖమ్మం ఖిల్లాపై రోప్‌వే నిర్మించేందుకు రూ.30కోట్లు కేటాయిస్తామన్నారు. నేలకొండపల్లి బౌద్ధస్థూపం వద్ద దాని చరిత్రను చాటిచెప్పేలా వసతులు, నిర్మాణాలు చేపడతామన్నారు. హాలెండ్‌ తరహాలో కిన్నెరసాని ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.

Updated Date - Aug 13 , 2024 | 03:54 AM

Advertising
Advertising
<