ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Investments: సీఎం సోదరుడైతే పెట్టుబడులు పెట్టకూడదా?

ABN, Publish Date - Aug 18 , 2024 | 02:57 AM

‘‘రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు చేసేలా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ముఖ్యమంత్రి సోదరుడికి లబ్ధి కలిగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు.

  • కేటీఆర్‌ సోదరుడు, సోదరి వచ్చినా ఆహ్వానిస్తాం

  • అప్పటి ఒప్పందాల అమల్లో సక్సెస్‌ రేట్‌ 30 శాతమే

  • త్వరలో అమెజాన్‌, పెప్సీకో పెట్టుబడులు: మంత్రి దుద్దిళ్ల

హైదరాబాద్‌, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ‘‘రాష్ట్ర వ్యవసాయ రంగానికి, రైతులకు మేలు చేసేలా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే ముఖ్యమంత్రి సోదరుడికి లబ్ధి కలిగిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి సోదరుడైతే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టకూడదా..? అమెరికాలో స్థిరపడి.. సొంత రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైతే ఎవరినైనా ఆహ్వానిస్తాం. కేటీఆర్‌ సోదరుడు, సోదరి పెట్టుబడులు పెడతామంటే కూడా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది’’ అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు.


ఇటీవల ముఖ్యమంత్రి నేతృత్వంలోని అధికార బృందం అమెరికా పర్యటనలో ఒప్పందం కుదుర్చుకున్న స్వచ్ఛ బయో కంపెనీలో సీఎం రేవంత్‌ సోదరుడు ఉండటంపై బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ చేస్తున్న విమర్శలకు ఆయన స్పందించారు. స్వచ్ఛ బయో కంపెనీ గత 18 ఏళ్లుగా అమెరికా కేంద్రంగా పరిశోధన, అభివృద్ధి రంగంలో పనిచేస్తోందని, బయో ఫ్యూయల్‌పై 8 పేటెంట్లను సాధించిందని, రాష్ట్రంలో ఇథనాల్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు సిద్ధమైందని తెలిపారు.


పెట్టుబడిదారులను తమ ప్రభుత్వం వ్యాపారవేత్తలుగానే చూస్తుందని, తమకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కొత్త పరిశ్రమల స్థాపనలో ఫెయిల్‌ అయిందని మంత్రి శ్రీధర్‌ బాబు తెలిపారు. ఐటీ, పరిశ్రమల మంత్రిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్‌ కుదుర్చుకున్న ఒప్పందాల్లో కేవలం 30 శాతం మాత్రమే పెట్టుబడులు పెట్టాయని తెలిపారు. ‘‘గత ప్రభుత్వం చేసిందంతా ప్రచార అర్భాటం తప్ప ఇంకేమీ లేదు. 30 మార్కులు సాధించిన ప్రభుత్వాన్ని ఫెయిల్‌ ప్రభుత్వమే అంటారు. సీఎంగా కేసీఆర్‌ 15 రోజులపాటు చైనాలో పర్యటించారు. అప్పుడు రూ.లక్ష కోట్ల ఒప్పందాలు చేసుకున్నా.. పెట్టుబడులు పెట్టింది కేవలం 30 శాతమే.


దావోస్‌, అమెరికా, కొరియా పర్యటనల్లో మా ప్రభుత్వం చేసుకున్న ప్రతీ ఒప్పందాన్నీ వ్యాపారంగా మలిచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తాం’’ అని వివరించారు. అమరరాజా గ్రూప్‌ గత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం అమలు చేస్తుందా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీఎం రేవంత్‌ కంపెనీ ఎండీతో మాట్లాడారన్నారు. అమెరికా పర్యటనలో 19 కంపెనీలతో రూ.31,500 కోట్ల ఒప్పందాలు; దక్షిణ కొరియాలో 6 కంపెనీలతో రూ.4,300 కోట్ల పెట్టుబడులు కలిపి మొత్తం రూ.35,800 కోట్ల ఒప్పందాలు కుదిరాయని తెలిపారు. త్వరలో అమెజాన్‌, పెప్సీకో, కోంపాస్ట్‌, అమెరికన్‌ ఎయిర్‌ లైన్స్‌, సిగ్నా లాంటి పెద్ద కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమవుతున్నాయని చెప్పారు.

Updated Date - Aug 18 , 2024 | 02:57 AM

Advertising
Advertising
<