ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: వామ్మో వైరల్‌ న్యూమోనియా..

ABN, Publish Date - Jun 22 , 2024 | 04:36 AM

రాష్ట్రంలో వైరల్‌ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన రెండు నెలల్లోనే హైదరాబాద్‌లో వైరల్‌ ఫీవర్‌ బారిన పడి ఆస్పత్రులకు వచ్చినవారి సంఖ్య 1200కు పైగానే ఉన్నట్టు సమాచారం!

  • ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్లతో ఐసీయూలకు!

  • పెరుగుతున్న కేసుల సంఖ్య.. అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైరల్‌ జ్వరాల సంఖ్య పెరుగుతోంది. మరీ ముఖ్యంగా రాజధాని హైదరాబాద్‌లో ఈ కేసుల సంఖ్య ఎక్కువగా ఉంది. గడిచిన రెండు నెలల్లోనే హైదరాబాద్‌లో వైరల్‌ ఫీవర్‌ బారిన పడి ఆస్పత్రులకు వచ్చినవారి సంఖ్య 1200కు పైగానే ఉన్నట్టు సమాచారం! వైరల్‌ ఫీవర్‌ వస్తే నాలుగైదు రోజుల్లో అదే తగ్గిపోతుందని.. జ్వరానికి పారాసెటమాల్‌ తప్ప మరే మందులూ అక్కర్లేదని గతంలో వైద్యులు చెప్పేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి అలా లేదని వైరల్‌ ఫీవర్లు పదిరోజుల దాకా కూడా ఉంటున్నాయని.. కొందరిలో ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్‌కు గురై న్యూమోనియా బారిన పడుతున్నారని.. వారిలో ఆక్సిజన్‌ స్థాయులు పడిపోతుండడంతో ఐసీయూలో చేర్చి చికిత్స చేయాల్సివస్తోందని వైద్యనిపుణులు వెల్లడిస్తున్నారు.


వారిలోనూ కొందరికి ఇతర అవయవాల పనితీరు మందగించి..వెంటిలేటర్‌, ఎక్మో చికిత్స కూడా చేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా వైరల్‌ న్యూమోనియాతో ఆస్పత్రిలో చేరి ప్రత్యేక చికిత్సలు తీసుకున్నవారు దాదాపు 50 మంది దాకా ఉన్నట్టు సమాచారం. తరచుగా బయటతిరిగేవారిలో, మం చు ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లొచ్చిన వారిలో ఈ తరహా ఇబ్బందులు ఎక్కువగా చూస్తున్నామని వైద్యులు పేర్కొంటున్నారు.


ఇవీ లక్షణాలు..

వాతావరణ మార్పులకు ఎక్కువగా గురైనవారిలో వైరల్‌ న్యూమోనియా ఎక్కువగా కనపడుతోంది. దీనిబారిన పడ్డవారిలో ముందుగా జలుబు కనిపిస్తుందని.. నీరసనగా తయారవుతారని, రెండు రోజుల తర్వాత దగ్గు, ఆయాసం మొదలవుతున్నాయని వైద్యులు వివరించారు. దీన్ని నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఆక్సిజన్‌ స్థాయులు తగ్గిపోతాయని హెచ్చరించారు. వైరల్‌ న్యూమోనియాను సిటీ స్కాన్‌ ద్వారా నిర్ధారించవచ్చు. వైరల్‌ న్యూమోనియా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో.. మూత్రపిండాలు, మదుమేహం, కేన్సర్‌ బాధితులు, స్టెరాయిడ్స్‌ తీసుకుంటున్న వారు జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.


బయటకు వెళ్లినప్పడు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని.. చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని.. ఇంటికి రాగానే కాళ్లు, చేతులను శుభ్రం చేసుకోవాలని (లేదా) స్నానం చేయాలని.. సూచిస్తున్నారు. వీలైనంతవరకూ రద్దీ ప్రాంతాలకు వెళ్లవద్దని చెబుతున్నారు. అవసరమైన వారు ప్లూ, న్యూమోనియా వ్యాక్సిన్లు తప్పని సరిగా వేయించుకోవాలని వైద్యులు పేర్కొన్నారు.

Updated Date - Jun 22 , 2024 | 04:36 AM

Advertising
Advertising