Delhi Liquor Scam: నేడు సుప్రీంలో ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై విచారణ..!
ABN, Publish Date - Mar 22 , 2024 | 08:42 AM
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ఇవాళ విచారణకు రానుంది. తన అరెస్ట్ అక్రమమని, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కోరుతూ కవిత (Kavitha) సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం. త్రివేదిల సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది.
రాజకీయ ప్రోద్బలంతోనే
రాజకీయ ప్రోద్బలంతోనే తనను ఈడీ అరెస్ట్ చేసిందని కవిత ఆరోపించారు. కొందరు రాజకీయ నాయకులు తనను అరెస్ట్ చేయిస్తామని బహిరంగంగానే ప్రకటించిన విషయాన్ని తన పిటిషన్‌లో కవిత పేర్కొన్నారు. ఆధారాలు లేకపోయినా కుట్రలో భాగంగా తనను కేసులో ఇరికించేలా ఈడీ ప్లాన్ చేసిందని కవిత ఆరోపిస్తున్నారు. కొందరు నిందితుల స్టేట్‌మెంట్ల ఆధారంగానే కేసులో తన పేరు చేర్చారని, చార్జ్‌షీట్‌లో ఎక్కడా తనను నిందితురాలిగా పేర్కొనలేదనే విషయాన్ని పిటిషన్‌లో ప్రస్తావించారు.
Delhi CM Aravind Kejriwal: రాత్రంతా ఈడీ ఆఫీసులోనే కేజ్రీవాల్
కవిత ఆరోపణలు
తన విషయంలో ఈడీ ఏకపక్షంగా, నియంతృత్వంగా వ్యవహరించిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా తనను ఢిల్లీకి తరలించారని, రిమాండ్‌ను రద్దు చేసి, తనపై క్రిమినల్ ప్రొసీడింగ్స్ క్వాష్ చేయాలని కవిత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. మరోవైపు అన్ని ఆధారాలు సేకరించిన తర్వాతనే కవితను అరెస్ట్ చేశామని ఈడీ చెబుతోంది. మొత్తానికి సుప్రీంకోర్టు కవిత పిటిషన్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తుందనేది వేచి చూడాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Updated Date - Mar 22 , 2024 | 08:49 AM