TSRTC: గ్రేటర్ నుంచి పుణ్యక్షేత్రాలకు బస్సులు..
ABN, Publish Date - Jun 27 , 2024 | 10:17 AM
ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది.
- ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు
హైదరాబాద్ సిటీ: ప్రయాణికులకు సేవలు విస్తరించడంతో పాటు గ్రేటర్(Greater) నుంచి పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడుపుతూ అదనపు ఆదాయం పెంచుకోవడమే లక్ష్యంగా ఆర్టీసీ చర్యలు చేపడుతోంది. హైదరాబాద్ నుంచి శని, ఆదివారాల్లో యాదగిరిగుట్ట, వేములవాడ, కొమురవెల్లి, భువనగిరి(Yadagirigutta, Vemulawada, Komuravelli, Bhuvanagiri)లోని స్వర్ణగిరి టెంపుల్‌కు పెద్దసంఖ్యలో భక్తులు తరలివెళ్తుండటంతో ఆయా ప్రాంతాలకు బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో భాగంగా బుధవారం జేబీఎస్, ఉప్పల్(JBS, Uppal) నుంచి ఈ-మెట్రో నాన్‌ఏసీ రెండు బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది.
ఇదికూడా చదవండి: Hyderabad: బ్యాంక్‌ను మోసగించిన మేనేజర్ అరెస్ట్..
ఇదే తరహాలో యాదగిరిగుట్ట, కొమురవెల్లి స్పెషల్ సర్వీసులు నడిపేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. గ్రేటర్ జోన్ పరిధిలో 25 బస్ డిపోలుండగా రోజూ రూ.5.5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అందులో టికెట్లతో రూ. 3 కోట్లు, మహాలక్ష్మి జీరో టికెట్ల ద్వారా ప్రభుత్వం నుంచి రూ.2 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. అదనంగా మరో రూ.50 లక్షల వరకు ఆదా యం పెంచుకునే మార్గాలపై ఆర్టీసీ దృష్టి సారించింది.
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News
Updated Date - Jun 27 , 2024 | 10:17 AM